చిరంజీవి సోదరుడు నాగబాబు ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. హీరోగా, సహాయ నటుడిగా, నిర్మాతగా ఎన్నో చిత్రాలు నిర్మించి ప్రేక్షకులను మెప్పించారు. ఆయన తాజాగా జరిగిన ఓ షోలో ప్రేక్షకుల నుంచి ఓ విచిత్రమైన ప్రశ్న ఎదుర్కొన్నారు. దీంతో ఆయన స్పందించిన తీరు కూడా అందరిని ఆశ్చర్యపరచింది. సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఆయన ఓ నెటిజన్ నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన కూడా అదిరిపోయే జవాబు ఇచ్చారు.
రాక్షసుడు సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన నాగబాబు పలు చిత్రాల్లో తనదైన ముద్ర వేసి చిత్ర విజయాల్లో దోహదం చేశారు. ఎన్టీఆర్ తో చేసిన అరవింద సమేత వరకు కూడా ఆయన విభిన్నమైన పాత్రలతో అలరించారు. పలు చిత్రాల్లో తనదైన శైలిలో నటించి తన మార్కును చూపించారు. సక్సెస్ ఫుల్ ప్రయాణంలో ఎన్నో మెట్లు ఎక్కారు.
అపరంజి అనే సీరియల్ ద్వారా బుల్లితెరలో కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. శిఖరం, సీతామహాలక్ష్మి సీరియళ్లలో కూడా నటించారు. వీర అనే కార్యక్రమానికి జడ్జిగా మారి అదుర్స్ రెండు సీజన్లు పూర్తి చేశారు. గతంలోనే జబర్దస్త్ కు జడ్జిగా చాలా కాలం పాటు ఉన్నారు. దాన్ని నెంబర్ వన్ షోగా మలిచారు. తరువాత అదిరింది, బొమ్మ అదిరింది అనే షోలు చేశారు. ప్రస్తుతం ఖుషీఖుషీగా అనే షో చేస్తున్నారు.
మీకు బిగ్ బాస్ అంటే ఇష్టమా? ఐపీఎల్ అంటే ఇష్టమా అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. దీనికి నాగబాబు సరైన సమాధానం చెప్పారు. బిగ్ బాస్ షో చూడకుండా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చూస్తూ నా బిడ్డ లాంటి ప్రియాంక సింగ్ కు మద్దతు ఇస్తా అన్నారు. తద్వారా బిగ్ బాస్ షోను చూస్తానని పరోక్షంగా వివరించారు. ప్రియాంకను సపోర్టు చేస్తున్నానని చెప్పారు.
