
నేడు నాధురాం గాడ్సే పుట్టిన రోజు. ఈ సందర్భంగా మెగా బ్రదర్ నాగబాబు మహాత్మా గాంధీని చంపిన గాడ్సేకు అనుకూలంగా ట్వీట్ చేయడం వివాదస్పదంగా మారింది. దీనిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ హాట్ చర్చ నడుస్తోంది. నెటిజన్లు రెండువర్గాలు విడిపోయి వరుస కామెంట్లు పెడుతోన్నారు. కొందరు నాగబాబును సమర్థిస్తుండగా మెజార్టీ ప్రజలు మాత్రం ఆయనను తప్పుబడుతున్నారు. ఇంతకీ నాగబాబు ఏం ట్వీట్ చేశారంటే..
‘ఈ రోజు నాధురాం గాడ్సే పుట్టిన రోజు. నిజమైన దేశ భక్తుడు. గాంధీని చంపడం కరెక్టా కదా అనేది debatable. కానీ అతని వైపు ఆర్గ్యుమెంట్ ని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు. కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది. (ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే). గాంధీ ని చంపితే.. అపఖ్యాతి పాలౌతానని తెలిసినా తను అనుకున్నది చేసాడు. కానీ నాధురాం దేశభక్తిని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒక సారి గుర్తుచేసుకోవాలనిపించింది. పాపం నాధురాం గాడ్సే.. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్..’ అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు నాగబాబుపై తీవ్రస్థాయిలో మండిపడుతోన్నారు. ఎప్పుడూ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేసే నాగబాబు గాడ్సేకు అనుకూలంగా ట్వీట్ చేయడం పొలిటికల్ సర్కిల్స్ లోనూ చర్చనీయాంశంగా మారింది. ఉన్నట్టుండి నాగబాబుకు గాడ్సేపై ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందని పలువురు ప్రశ్నిస్తుండటం కొసమెరుపు.