ఏక్తాకపూర్ పై కేసు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు

బాలీవుడ్ దిగ్గజ నిర్మాత ఏక్తాకపూర్ పై తాజాగా హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్‌ను కలిసిన ఏక్తా కపూర్ చర్యలు తీసుకోవాలని లిఖితపూర్వంగా ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా ఆయన ఏక్తాకపూర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏక్తాకపూర్ చెందిన బాలాజీ టెలీ ఫిలింస్ నిర్మించిన ‘ అన్ సెన్సార్డ్ సీజన్-2’లో కొన్ని సన్నివేశాలు ఆర్మీ జవాన్లను కించపరిచేలా ఉన్నాయని తెలిపారు. ఈ వెబ్ సీరిసులోని అలాంటి సన్నివేశాలను […]

Written By: Neelambaram, Updated On : May 19, 2020 7:57 pm
Follow us on


బాలీవుడ్ దిగ్గజ నిర్మాత ఏక్తాకపూర్ పై తాజాగా హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్‌ను కలిసిన ఏక్తా కపూర్ చర్యలు తీసుకోవాలని లిఖితపూర్వంగా ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా ఆయన ఏక్తాకపూర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏక్తాకపూర్ చెందిన బాలాజీ టెలీ ఫిలింస్ నిర్మించిన ‘ అన్ సెన్సార్డ్ సీజన్-2’లో కొన్ని సన్నివేశాలు ఆర్మీ జవాన్లను కించపరిచేలా ఉన్నాయని తెలిపారు. ఈ వెబ్ సీరిసులోని అలాంటి సన్నివేశాలను తొలగించి వెంటనే క్షమాపణ చెప్పాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.

‘అన్ సెన్సార్డ్ సీజన్‌ -2’ వెబ్ సిరీస్ ట్రైలర్‌ ఇటీవలే రిలీజైంది. ఇందులో ఆర్మీ యూనిఫామ్‌ను కించపరిచేలా సన్నివేశాలుండటంతో పెద్దఎత్తున నిరసన వ్యక్తమవుతోన్నాయి. ప్రజల రక్షణ కోసం దేశ సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉందని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఏక్తాకపూర్ పై దేశంలోని పలుచోట్ల నుంచి ఫిర్యాదులు నమోదవుతోన్నాయి. ఇదే అంశంపై నగరానికి చెందిన విశాల్ కుమార్ అనే యువకుడు సోమవారమే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్మీ యూనిఫామ్ ను అపహస్యం చేసేలా చిత్రీకరించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫేస్ బుక్ పేజీలో రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ వెంటనే తొలగించాలని కోరాడు.