Naga Babu: మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల పెళ్లి రీసెంట్ గా జరిగిన సంగతి తెలిసిందే. నవంబర్ 1న ఈ జంట పెళ్లి బంధంతో ఒకటయ్యారు. వీరి వివాహం ఇటలీలో అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య జరిగింది. మెగా, అల్లు ఫ్యామిలీ ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ పెళ్లి జరిగిన దగ్గర నుంచి ఎన్నో వార్తలు వైరల్ గా మారాయి. వారు వేసుకున్న డ్రెస్ ధర దగ్గర నుంచి వాటి ఖరీదు వరకు చాలా వార్తలు వచ్చాయి. అయితే వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా అదే రేంజ్ లో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను నాగబాబు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. ఈ పోస్టే ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా మారింది. ఇంతకీ ఏంటి అంటారా?
ఈ ప్రేమ జంట పెళ్లికి సంబంధించిన ఫోటోలలో మెగా బ్రదర్స్ ఫోటో కూడా అదే తరహా వైరల్ అవుతుంది. దీన్ని నాగబాబు ఎంతో ఎమోషనల్ గా పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో నాగబాబు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఉన్నారు. ఒకే ఫ్రేమ్ లో వీరిని కలిసి చూడడం మెగా అభిమానులకు సంతోషకరమైన వార్తనే అని చెప్పాలి. అయితే మా మధ్య ఎన్ని విభేదాలు, వాదనలు తరచూ వస్తున్నా.. మా బంధం మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమైనది. మేము చేసిన పనులు, మా జ్ఞాపకాలు మాత్రమే కాదు, మా మధ్య ఏర్పడే విభేదాల కంటే మా అనుబంధం ఎంతో ముఖ్యమైనది. మా రిలేషన్ షిప్ ఎన్నో మంచి క్షణాలపై ఆధారపడి ఉంది. మా మధ్య రిలేషన్ చాలా బలమైనది, విడదీయలేనిది అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు నాగబాబు.
అయితే గొడవలు కామన్, విభేదాలు కామన్ కానీ మా మధ్య ఉన్న రిలేషన్ స్ట్రాంగ్ అనే విధంగా నాగబాబు చేసిన ఈ పోస్ట్ వీరి అభిమానులకు ఊపునిస్తుంది. మీ ముగ్గురు ఎప్పుడు కూడా ఇలానే కలిసిమెలిసి ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీ మొత్తం ఇటలీలో సందడి చేశారు. 5వ తేదీనా హైదరాబాద్ లో జరగబోయే వరుణ్, లావణ్యల నిశ్చితార్థానికి టాలీవుడ్ మొత్తం కదిలి రానుంది.