Nag Ashwin: ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి దర్శకుడుగా పరిచయమైన నాగ్ అశ్విన్ మంచి సక్సెస్ ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత మహానటి సావిత్రి గారి బయోపిక్ ని మహానటి పేరిట తీసి సూపర్ సక్సెస్ అందుకోవడమే కాకుండా విమర్శకుల నుంచి కూడా ప్రశంశలు అందుకున్నాడు.
ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో ప్రభాస్ హీరోగా కల్కి 2898 ఎడి అనే సినిమా చేస్తున్నాడు ఇక రీసెంట్ గా ఆయన ఐఐటి విద్యార్థులతో ముచ్చటించారు. ఇక ఆ సందర్భంలో నాగ్ అశ్విన్ కల్కి సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా కోసం 4 నుంచి 5 సంవత్సరాల వరకు కేటాయించినట్టుగా చెప్పారు. అలాగే ఈ సినిమాని ఇంతవరకు ఎవరూ కూడా డీల్ చేయని విధంగా అత్యాధునిక టెక్నాలజీతో సినిమా చేస్తున్నట్టుగా చెప్పాడు.అలాగే ఇంతకు ముందు ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా మనం చూడాలి అంటే దానికోసం హాలీవుడ్ సినిమాలను సంప్రదించాల్సిన అవసరం వచ్చేది కానీ ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా అత్యాధునికమైన చాలా విజయాన్ని వెచ్చించి అలాగే చాలా కష్టంతో కూడినప్పటికీ వాటన్నింటిని సమకూరుస్తు ఒక బెస్ట్ క్వాలిటీ తో కల్కి సినిమా చేస్తున్నాము అని చెప్పాడు ముఖ్యంగా మన దేశంలో ఇప్పటివరకు 2898 లో ఇండియా ఎలా ఉంటుంది అనేదాని మీద ఇలాంటి కథలతో సినిమాలు రాలేదు.
దాంతో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా చాలా కొత్త సినిమా అవుతుందని చెబుతూ దానికి తగ్గట్టుగానే చాలా కష్టపడి మంచి ఔట్ పుట్ తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నాము. ఇక ఇంతకు ముందు వచ్చిన ఈ సినిమా టీజర్ తో ఈ సినిమా మీద ఒక్కసారిగా అంచనాలు అయితే పెరిగాయి. తొందరలోనే ట్రైలర్ రిలీజ్ చేసి ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ని కూడా ప్రేక్షకుల ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను… ఈ సినిమాతో హాలీవుడ్ సినిమా సైతం తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు చూసే విధంగా చేయబోతున్న అంటూ నాగ్ అశ్విన్ చాలా కాన్ఫిడెంట్ గా ఐఐటి విద్యార్థులతో తన సినిమా గురించి చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది…
ఈ సినిమాతో నాగ్ అశ్విన్ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని అయితే ఏర్పాటు చేసుకోబోతున్నాడు అనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాతో సక్సెస్ కనక వచ్చినట్లయితే ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానం అయితే కల్పించుకోబోతున్నాడు అనేది తెలుస్తుంది…