Nag Ashwin : ఈ రోజుల్లో సినిమా ఇండస్ట్రీలో ఒక చిన్న సక్సెస్ సాధిస్తే చాలు హీరోలు గాని, దర్శకులు గానీ విపరీతమైన పబ్లిసిటీ చేసుకొని వాళ్ళని వాళ్ళు మార్కెట్లో చాలా గొప్ప ప్రాజెక్ట్ చేసుకుంటున్నారు. తద్వారా జనాలకి వాళ్లంటే పిచ్చి అభిమానం ఉండే విధంగా పిఆర్ టీం లతో ప్రమోట్ అయితే చేసుకుంటారు. మరి ఇలాంటి సందర్భంలోనే కల్కి (Klaki) లాంటి గొప్ప సినిమాను తీసిన నాగ్ అశ్విన్ (Nag Ashwin) లాంటి దర్శకుడు మాత్రం ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా తనను తాను ఎక్కడ ఎలివేట్ చేసుకోకుండా చాలా సింపుల్ గా బ్రతకడానికి చాలా ఇష్టపడుతుంటాడు. అందువల్లే ఆయన మీడియాలో కనిపించిన ప్రతిసారి చాలా సింపుల్ గా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అందువల్లే అతనికి చాలా మంది అభిమానులుగా మారారని చెబుతూ ఉంటారు. కల్కి సినిమాతో 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టాడు. ఇక ఈయన ప్లేస్ లో వేరే ఏ దర్శకుడు ఉన్నా కూడా వాళ్ళను ఎంతో గొప్పగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఆయన మాత్రం దానికి పూర్తి భిన్నంగా ఉంటాడు.
Also Read : ‘కల్కి’ పై ప్రభాస్ ఫ్యాన్స్ సంతృప్తిగా లేరని నాకు తెలుసు – నాగ అశ్విన్
ఎందుకంటే సింపుల్ గా ఉంటూ నార్మల్ లైఫ్ గడపడం అంటేనే అతనికి చాలా ఇష్టమని అందువల్ల అందరితో కలిసి ఉంటున్నప్పటికి తను మాత్రం ఎక్కడ సెలబ్రెటి లా ఫీల్ లేకుండా సామాన్యులతో కూడా చాలా బాగా గడుపుతూ ఉంటారని తన సన్నిహితులు కూడా చెబుతున్నారు. కారణం ఏంటి అంటే మనిషి ఎప్పుడూ ఈ భూమిని వదిలి వెళ్ళిపోతాడో తెలియదు.
దానికోసం మనం నటులమని, మనం దర్శకులం అని ఒకరు గొప్ప గా భావిస్తూ మనం ఇతరుల కంటే గొప్పవారమని వాళ్ళను వాళ్ళు ఎలివేట్ చేసుకోవాలనే ఉద్దేశ్యం తనకైతే ఉండదట. అందుకే సామాన్య మానవుడిలా అందరితో కలిసి పోతూ ఉంటానని పలు సందర్భాల్లో తెలియజేశారు… ఇక ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో కల్కి 2 సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు తద్వారా ఆయనకంటూ ఒక భారీ గుర్తింపును ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడా? లేదా అనే విషయాల మీద సరైన క్లారిటీ అయితే రావాల్సి ఉంది. మరి ఏది ఏమైనప్పటికి నాగ్ అశ్విన్ లాంటి దర్శకుడు మరిన్ని భారీ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు వెళ్లాలని కోరుకుందాం.
Also Raed : ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన నాగ్ అశ్విన్…ఇక రచ్చ రచ్చే…