Nag Ashwin , Prabhas
Nag Ashwin and Prabhas : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్(Prabhas) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. యంగ్ రెబల్ స్టార్ గా మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న ఆయన ఈ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నమైతే చేస్తూ వస్తున్నాడు. ఒకప్పుడు తెలుగుకు మాత్రమే పరిమితమైన ఆయన ఇప్పుడు ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా ఎదిగే ప్రయత్నమేతే చేస్తున్నాడు. మరి అందులో భాగంగానే ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ఇప్పటికే ఆయన చేసిన బాహుబలి సిరీస్, సాహో(Saho), సలార్(Salar), కల్కి (Kalki) సినిమాలతో చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. మరి దానికి తగ్గట్టుగానే ఇప్పుడు సందీప్ రెడ్డివంగ దర్శకత్వంలో ‘స్పిరిట్ ‘ (Spirit) సినిమాను చేస్తున్నాడు…
ఇక దాంతోపాటుగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి సినిమాకి సీక్వెల్ గా కల్కి 2 మూవీని కూడా తెరకెక్కించే పనుల్లో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయినట్టుగా తెలియజేశాడు.
అయితే ఈ సినిమాని వచ్చే ఏడాది చివర్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న సందర్భంలో తొందర్లోనే ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంలో నాగ్ అశ్విన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ ‘రాజాసాబ్ ‘, ‘ఫౌజీ ‘ ఈ సినిమాల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలు పూర్తయిన తర్వాత ‘కల్కి 2’ సినిమా కోసం కేటాయించే అవకాశమైతే ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాలతో పాటుగా ఆయన రాబోయే మరికొన్ని సినిమాలను కూడా లైన్ లో పెట్టాడు. ఇక ఈ లెక్కన ప్రభాస్ దాదాపు మూడు సంవత్సరాల వరకు ఫ్రీ అయ్యే అవకాశాలైతే లేవు. ఇక వీటితో పాటుగా ‘ప్రశాంత నీల్’ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఇక ఏది ఏమైనా కూడా దానికి సీక్వేల్ గా ‘సలార్ 2’ సినిమాకి కూడా రాబోతుంది.
మరి ఈ సినిమాలన్నింటిని ప్రభాస్ ఈ రెండు మూడు సంవత్సరాల నుండి ఫినిష్ చేసి కొత్త సినిమాలకు కమిట్ అవ్వాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ప్రభాస్ తనదైన ఇప్పుడు పూర్తిగా ఫుల్ అయిపోయింది. ఇక ఏది ఏమైనా కూడా మిగతా దర్శకులతో ఆయన సినిమా చేయాలంటే మాత్రం మరి కొన్ని రోజుల వరకు వేచి చూడాల్సిన అవసరమైతే ఉంది…