Nabha Natesh: హాట్ బ్యూటీ ‘నభా నటేష్’కి గత కొంతకాలంగా సరైన అవకాశాలు రాలేదు. నిజానికి ప్రస్తుతం ఉన్న చాలామంది గ్లామర్ డాల్స్ కంటే కూడా, నభా అందంలోనూ అభినయంలోనూ చాలా మంచి హీరోయిన్. కానీ, ఎందుకో నభాకి ఇన్నాళ్లు చెప్పుకోతగ్గ పెద్ద సినిమా ఆఫర్లు రాలేదు. ప్రస్తుతం ఆఫర్లు కోసం ఆమె నానా కష్టాలు పడుతుంది. అయితే, తాజాగా చార్లీ చాప్లిన్ లుక్ లో కనిపించి నభా నెటిజన్లకు షాక్ ఇచ్చింది.
![]()
ఎక్కువగా గ్లామర్ పాత్రలకే పరిమితం అయ్యే ఈ ముద్దుగుమ్మ తాజాగా చార్లీ చాప్లిన్ అవతారంలో ఎందుకు కనిపించిందా అని ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. నభా నటేష్ నుంచి వచ్చిన ఈ భిన్నమైన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక చార్లీ చాప్లిన్ గా నభా ఫన్నీగా ఉంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే ఈ భామ ‘మాస్ట్రో’ సినిమాలో నటించి మెప్పించింది.
అయినా ఈ బ్యూటీకి మాత్రం అవకాశాలు రావడం లేడు. అందుకే ఈ మధ్య ఎక్కువగా అందచందాలు ఆరబోసి ఫాలోవర్స్ కి కనువిందు చేయడానికి బాగానే కసరత్తులు చేస్తోంది. మొహమాటం లేకుండా స్టార్ హీరోలకు ఫోన్ చేసి మరీ నాకు ఛాన్స్ లు ఇవ్వండి అని వేడుకుంటుంది. అయితే మొత్తానికి నభా బాధను అర్థం చేసుకున్న బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఆమెకు ఛాన్స్ ఇచ్చాడు.
ఒక విధంగా నభా కి ఇది గోల్డెన్ ఛాన్సే. పైగా హాలీవుడ్ లో విపరీతమైన ప్రేక్షకాదరణ పొందిన స్పై థ్రిల్లర్ ‘ది నైట్ మేనేజర్’కి రీమేక్ గా వస్తోన్న ఈ సిరీస్ లో ఆమె హృతిక్ సరసన నటించబోతుంది. ఈ సిరీస్ హిట్ అయితే ఇక నభా నటేష్ కెరీర్ తిరిగినట్టే. ఇప్పట్లో ఈ బ్యూటీకి ఇక తిరుగు లేనట్లే. పాన్ ఇండియా రేంజ్ లో అవకాశాలు వస్తాయి.
అన్నట్టు అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం హీరోగా చేయబోతున్న కొత్త సినిమాలో నభా నటేష్ ని ఒక హీరోయిన్ గా తీసుకున్నారని తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందొ చూడాలి.