https://oktelugu.com/

అయ్యో నభా.. ఛాన్స్ లేక నలిగిపోతుంది !

నభా నటేష్ కి ఛాన్స్ లు కావాలి, అందుకే తన అందాల సోయగాల డోస్ రోజురోజుకు పెంచుకుంటూ పోతుంది. పెంచకపోతే నిలబడటం కష్టం, పైగా ఇప్పటికే రేస్ లో పూర్తిగా వెనుకబడి, ఛాన్స్ లు లేక నలిగిపోతుంది. చేతిలో ఒక్క ‘మాస్ట్రో’ సినిమా తప్ప చెప్పుకోడానికి పెద్దగా సినిమా కూడా లేదు. మాస్ట్రోలో నితిన్ సరసన నటిస్తోంది, అలాగే ఈ సినిమా హాట్ స్టార్ లో విడుదల అవుతుంది. సో.. కెరీర్ పరంగా నభాకి ఇది హెల్ప్ […]

Written By:
  • admin
  • , Updated On : July 24, 2021 / 10:32 AM IST
    Follow us on

    నభా నటేష్ కి ఛాన్స్ లు కావాలి, అందుకే తన అందాల సోయగాల డోస్ రోజురోజుకు పెంచుకుంటూ పోతుంది. పెంచకపోతే నిలబడటం కష్టం, పైగా ఇప్పటికే రేస్ లో పూర్తిగా వెనుకబడి, ఛాన్స్ లు లేక నలిగిపోతుంది. చేతిలో ఒక్క ‘మాస్ట్రో’ సినిమా తప్ప చెప్పుకోడానికి పెద్దగా సినిమా కూడా లేదు.

    మాస్ట్రోలో నితిన్ సరసన నటిస్తోంది, అలాగే ఈ సినిమా హాట్ స్టార్ లో విడుదల అవుతుంది. సో.. కెరీర్ పరంగా నభాకి ఇది హెల్ప్ అయ్యే సినిమా. కాబట్టి ‘మాస్ట్రో’ కోసం గట్టిగా ప్రమోషన్స్ చేయడానికి ప్లాన్ చేసుకుంటుంది. అసలకే బాలీవుడ్ లో హిట్టైన ‘అంధధూన్’ సినిమాకి ఇది రీమేక్ కాబట్టి, తెలుగులో కూడా ఈ సినిమా హిట్ అయ్యే అవకాశం ఉంది.

    కాకపోతే, హిందీ ఒరిజినల్ సినిమా చూసిన ఎవరికైనా అర్ధం అయిపోతుంది. ఈ సినిమాలో నభాది కూరలో కరివేపాకు టైపు పాత్ర అని. ఆ భయం నభాకి బాగానే ఉంది. అందుకే, కెరీర్ ఇలాంటి టైంలోనే పికప్ అవ్వాలి. అలాగే మంచి జోష్ రావాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే నభా గ్లామర్ డోస్ ఫోటోషూట్లు తెగ హడావిడి చేస్తూ ముందుకుపోతుంది.

    తన అందం చూసైనా ఎవరైనా ఛాన్స్ ఇస్తారని నభా ఆత్రుత. కానీ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో అర్ధం కానీ పరిస్థితి. అయితే నభాకి ఓ ఆఫర్ ఉందనేది ఓపెన్ సీక్రెట్. త్వరలోనే గోపీచంద్ సరసన ఒక మూవీ చేసే అవకాశం ఉంది. శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ తన 30వ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఒక భామగా నభాని తీసుకోవాలని అనుకుంటున్నారట.