నటీనటులుః నరేష్, వరలక్ష్మీ శరత్‌కుమార్, ప్రియదర్శి, దేవీప్రసాద్, వినయ్ వర్మ, సి.ఎల్.నరసింహారావు, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు
సంగీతంః శ్రీచరణ్ పాకాల
ఎడిటింగ్ః చోటా కె ప్రసాద్
సినిమాటోగ్రఫిః సిధ్
నిర్మాతః సతీష్ వేగేశ్న
దర్శకత్వంః విజయ్ కనకమేడల
రిలీజ్ డేట్ః 19 ఫిబ్రవరి 2021
Also Read: ట్రైలర్ టాక్: పెళ్లాం పోరు.. సస్పెన్స్ థ్రిల్లర్ గా ‘క్షణక్షణం’
‘అల్లరి’నరేష్.. అల్లరిని ఇంటి పేరుగా మార్చుకున్న నరేష్.. సినిమాలన్నీ దాదాపుగా అలాగే ఉంటాయి. రాజేంద్ర ప్రసాద్ తర్వాత కామెడీ హీరో స్థాయిని అందుకున్న హీరో నరేష్ మాత్రమే. వరుస హిట్లతో ‘మినిమమ్ గ్యారంటీ’ హీరోగా పేరు తెచ్చుకున్న నరేష్.. ఆ ట్యాగ్ లైన్ తో వెండి తెరపై రచ్చ రచ్చ చేశాడు. అయితే.. రొటీన్ గా చేసిందే చేస్తే, ఏదైనా బోర్ కొట్టేస్తుంది. నరేష్ సినిమాల విషయంలోనూ అదే జరిగింది. కేవలం ‘స్ఫూఫ్ యాక్టర్’ గా మారిపోయిన నరేష్ సినిమాలను ఆడియన్సల్ లైట్ తీసుకోవడం మొదలు పెట్టారు. దీంతో.. మనోడి కెరీర్ ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి తలెత్తింది. ఇలాంటి కండీషన్లో రొటీన్ కు భిన్నంగా క్రైమ్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి, ఈ సినిమా నరేష్ సరికొత్త సినీ జర్నీకి ‘నాంది’ పలికిందా? లేదా? అన్నది చూద్దాం.
కథ ఏంటి..?
‘ఇక్కడి చట్టాలు చేతకానివాడిపై వాడటానికేరా.. పవర్‌లో ఉన్నోన్ని ఏం పీకలేవు’ అంటూ నిష్టుర సత్యాన్ని రివీల్ చేసిన ట్రైలర్.. ఈ సినిమా కండీషన్ ఏంటో చెప్పేసింది. చేయని నేరానికి జైలుపాలైన ఓ అమాయకుడు.. ఆ కేసు నుంచి ఎలా బయటపడ్డాడు..? అందుకు గల కారణాలేంటి? అనే మెయిన్ పాయింట్ తో తెరకెక్కింది ‘నాంది’. సినిమా ఆరంభంలోనే జైలు కు వెళ్తాడు బండి సూర్య ప్రకాష్ (అల్లరి నరేష్). ఐదు సంవత్సరాలు జైల్లోనే గడుపుతాడు. ఆ తర్వాత ఓ యూట్యూబ్ ఛానల్ వ్యక్తి (ప్రియదర్శి) జైలుకు వస్తాడు. వివాదాస్పద టైటిల్స్ వల్ల పోలీసులు అరెస్టు చేస్తుంటే.. జైలుకు వచ్చిపోతుంటాడు.
ఇక్కడ మలుపు తీసుకున్న కథ.. బండి సూర్య ప్రకాష్ ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేస్తుంది. తన ప్రేమ ఫలించి పెళ్లి కూడా సిద్ధమవుతాడు సూర్య ప్రకాష్. నిశ్చితార్థం కూడా జరుగుతుంది. అయితే.. అదే సమయంలో సామాజిక కార్యకర్త అయిన రాజగోపాల్ అనే వ్యక్తి హత్యకు గురవుతాడు. ఈ నేరం అటూఇటూ తిరిగి అమాయకుడైన బండి సూర్య ప్రకాష్ పై పడుతుంది. దీంతో పోలీసులు అతనిని అరెస్టు చేసి జైలుకు తరలిస్తారు. ఈ ఫ్లాష్ బ్యాక్ ముగుస్తుందనగా.. అద్బుతమైన ట్విస్ట్ తో వరలక్ష్మి శరత్ కుమార్ ఎంటర్ అవుతుంది. ఆ విధంగా ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది.
సెకండ్ పార్ట్ లో.. తనపై నేరం ఎలా మోపబడింది? అసలు ఆ మర్డర్ ఎలా జరిగింది? అనే విషయాలు తెలుసుకునేందుకు జైలు నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంటాడు సూర్య ప్రకాష్. ఈ క్రమంలోనే కోర్టులో కేసు విచారణ సందర్భంగా.. హత్యకు సంబంధించిన పలు కీలక విషయాలు వెలుగు చూస్తాయి. దీంతో.. చేయని తప్పుకి ఐదేళ్లుగా శిక్ష అనుభవిస్తున్న సూర్య ప్రకాష్ తీవ్ర ఆవేదనకు, ఆగ్రహానికి గురవుతాడు. మరి, జైలు నుంచి అతను ఎలా బయటపడ్డాడు? అతన్ని కేసులో ఇరికించిన వారిని చట్టానికి ఎలా పట్టించాడు? అనే విషయాలను తెరపై చూడాలి.
Also Read: పవర్ ఫుల్ కాంబో.. పవన్ తో పూరీ ఫిక్స్?
పెర్ఫార్మెన్స్:
అల్లరి నరేష్ కు ఇది 57వ చిత్రం. తన గత చిత్రాలకు పూర్తి భిన్నమైన క్రైమ్ ఎమోషన్ కథతో వచ్చిన నరేష్.. ఈ సినిమాలో జీవించాడని చెప్పొచ్చు. కెరీర్ ఆరంభంలోనే ‘నేను’, గమ్యం వంటి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాల్లో నటించాడు. ఇప్పుడు కెరీర్ పరంగా చావోరేవో తేల్చుకోవాల్సిన సినిమాల్లో అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. చేయని నేరానికి జైల్లో కుమిలిపోయే సీన్లలో వంకపెట్టలేని విధంగా నటించాడు. నరేష్ తర్వాత సినిమాలో ఆకట్టుకున్నది వరలక్ష్మీ శరత్ కుమార్ మాత్రమే. తెలుగు ప్రేక్షకులకు ఇప్పుడిప్పుడే దగ్గరవుతున్న వరలక్ష్మీ.. మరోసారి మంచి స్కోప్ ఉన్న సినిమా చేశారు. మిగిలిన పాత్రలకు పెద్దగా స్కోప్ లేదు. అందరూ తమ పరిధిమేరకు చక్కగా నటించారు.
సాంకేతిక వర్గం:
దర్శకుడు విజయ్ కనకమేడల తన టాలెంట్ మొత్తం చూపించాడు. సినిమా లో ఎటువంటి లాగ్ లేకుండా చక్కగా ప్రజెంట్ చేశాడు. జైలు, కోర్టు సీన్లలో తన దర్శకత్వ ప్రతిభను చాటుకున్నాడు. చక్కటి స్క్రీన్ ప్లేతోనూ ఆకట్టుకున్నాడు. ఇలాంటి చిత్రాలకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా కీలకం. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. సిధ్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. జైలు గోడల మధ్య, కోర్టు సీన్లలో ఆయన పనితనం కనిపిస్తుంది.
విశ్లేషణ :
ట్రైలర్ తోనే సినిమాపై క్యూరియాసిటీని పెంచాడు దర్శకుడు. అది సినిమాలోనూ కంటిన్యూ అయ్యింది. ఎమోషనల్ క్రైం కంటెంట్ ను ఆద్యంతం ఆసక్తికరంగా ముందుకు సాగేలా చూసుకున్నాడు దర్శకుడు. ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి. ఆసక్తి విషయంలో భిన్నాభిప్రాయలు ఉన్నప్పటికీ.. ప్రేక్షకులను కథలో లీనం చేయడంలో మాతరం దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. కోర్టు సన్నివేశాలను మరింత ఇంట్రస్టింగ్ గా మలిచే ఛాన్స్ ఉంది. ఈ సినిమాలో నరేష్, వరలక్ష్మి పాత్రలు మినహా.. మిగిలిన వాటికి అంతగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం వెలితిగా అనిపిస్తుంది. ఇక, ప్రధానమైన క్లైమాక్స్ ను కొత్తగా పరిచయం చేయాలని చూశారు. ఇది అందరికీ నచ్చకపోవచ్చు. ప్రేక్షకులు ఎంత మేర యాక్సెప్ట్ చేస్తారనేది చూడాలి. క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ను ఇష్టపడేవాళ్లు ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా సినిమా చూడొచ్చు.
బలాలుః కథ, నరేష్ యాక్టింగ్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్
బలహీనతలుః ఫస్టాఫ్ స్లో నెరేషన్, ఇతర పాత్రల నిడివి తక్కువగా ఉండడం
లాస్ట్ లైన్ః అల్లరి నరేష్ సెకండ్ వెర్షన్ కు ‘నాంది’
రేటింగ్: 3/5
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Naandhi movie review
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com