Bangarraju: అక్కినేని నాగార్జున బంగార్రాజు సినిమా సంక్రాంతి రేసులో ఉంది. ప్రస్తుతం కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నా.. సినిమా టీం మాత్రం ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. కాగా ప్రమోషన్స్ లో భాగంగా చిత్రబృందం ఇప్పటికే ‘కొత్తగా నాకేమయ్యిందో’ అంటూ ఒక సాంగ్ ను రిలీజ్ చేసింది. అనూప్ రూబెన్స్ ఇచ్చిన అద్భుతమైన ట్యూన్ కి లిరికల్ రైటర్ బాలాజీ వండర్ ఫుల్ లిరిక్స్ ఇచ్చాడు.

ఇక ఎప్పటిలాగే సింగర్ సిద్ శ్రీరామ్ ఈ పాటను అద్భుతంగా ఆలపించాడు. కాగా 2022 స్టార్టింగ్ లో బెస్ట్ సాంగ్స్ లో ఈ సాంగ్ కూడా బెస్ట్ సాంగ్ గా నిలిచింది. అయితే, ఈ సాంగ్ ఇంత గొప్ప హిట్ కావడానికి ముఖ్య కారణం.. ఈ సాంగ్ లిరిక్స్. మరి ఈ సాంగ్ లిరిక్స్ ఎలా ఉన్నాయో ? ఆ పదాల్లోని బావాలు ఏమిటో చూద్దాం.
కొత్తగా నాకేమయ్యిందో
వింతగా ఏదో మొదలయ్యిందో
అంతగా నాకర్ధం కాలేదే
మెరుపులా నీ చూపేమందో
చినుకులా నాపై వాలిందో
మనసిలా నీవైపే తిరిగిందే
ఇంకో ఆశ రెండో ధ్యాస
లేకుండా చేశావు
మాటల్లేని మంత్రం వేసి
మాయలోకి తోశావూ
నా కోసం మారావా నువ్వూ
లేక, నన్నే మార్చేశావా నువ్వూ
నాకోసం మారావా నువ్వూ
లేక, నన్నే మార్చేశావా నువ్వూ
ఓ, నవ్వులే చల్లావు
పంచుకోమన్నావు
తొలకరి చిరుజల్లై నువ్వూ
కళ్లకే దొరికావు… రంగుల మెరిసావు
నేలపై హరివిల్లా నువ్వూ
నిన్నా మొన్నల్లో ఇల్లా లేనే లేనంటా
నీతోనే ఉంటే ఇంకా ఇంకా బాగుంటా
మాటల్లోని మారాలన్నీ
మంచులాగ మార్చావు
నీకోసం మారానే నేనూ
నీతో నూరేళ్లు ఉండేలా నేనూ
నీకోసం మారానే నేనూ
నీతో నూరేళ్లు ఉండేలా నేనూ
ఓ, మాటలే మరిచేలా
మౌనమే మిగిలేలా
మనసుతో పిలిచావా నన్నూ
ఓ ఓఓ, కన్నులే అడిగేలా
చూపులే అలిసేలా
ఎదురుగా నిలిపావా నిన్నూ
పైకే నవ్వేలా లోకం అంతా నువ్వేలా
నాకే ఈవేళా నేనే నచ్చా నీ వల్లా
మోమాటాలే దూరం చేసే
మాట నీకు చెప్పేలా
ఓ ఓఓ, నీ వెంటే ఉంటున్నా నేనూ
నువ్వే లేకుంటే ఉంటానా నేనూ
నీ వెంటే ఉంటున్నా నేనూ
నువ్వే లేకుంటే ఉంటానా నేనూ
Also Read: Rakul Preet Singh: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్.. ఎప్పుడంటే?
కాగా పాట అయితే చాలా బాగా వచ్చింది. ఈ పాటలోని వీఎఫ్ఎక్స్ కు కూడా ఎక్కువ సమయం పట్టింది. ఇక నాగార్జున, నాగ చైతన్య పాత్రలు సమానంగా ఉంటాయి. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
Also Read: Shyam Singha Roy: బాక్సాఫీస్ : ‘శ్యామ్ సింగరాయ్’ ఫుల్ కలెక్షన్స్ డిటైల్స్ !