Naa Autograph: రవితేజ హీరోగా వచ్చిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. కారణం ఏదైనా కూడా ఆ సినిమా ఫీల్ గుడ్ మూవీగా ప్రేక్షకుల మన్ననలను పొందినప్పటికి విమర్శకుల నుంచి ప్రశంసలను సైతం అందుకుంది. కానీ సినిమా మాత్రం కమర్షియల్ గా అంత పెద్దగా సక్సెస్ ను సాధించలేదంటూ ఆ సినిమా ప్రొడ్యూసర్ అయిన బెల్లంకొండ సురేష్ ఒక ఇంటర్వ్యూ లో తెలియజేయడం విశేషం…నిజానికి ఆ సినిమా సూపర్ హిట్ అయ్యేది కానీ ఒక మిస్టేక్ వల్ల ఆ సినిమా ఆశించిన మేరకు ఆడలేదని చెప్పాడు… మొదట ఈ సినిమాను చేసిన తర్వాత ఫస్ట్ కాపీ చూసేటప్పుడు పరుచూరి బ్రదర్స్ ను పిలిచి సినిమా చూపించామని వాళ్లు సినిమా మొత్తాన్ని చూసి ఒక సజెషన్ చెప్పారు… సినిమాలో హీరోయిన్ మలయాళంలో మాట్లాడుతుంది. కాబట్టి ఆ లాంగ్వేజ్ మన తెలుగు వాళ్ళకు అర్థం కాకపోవచ్చు… కాబట్టి హీరోయిన్ మాట్లాడేటప్పుడు మనం బ్యా గ్రౌండ్ లో తెలుగు వాయిస్ ఓవర్ ఇస్తే బాగుంటుంది అది ముందే టైటిల్ కార్డ్స్ లో మన సౌకర్యార్థం హీరోయిన్ మాట్లాడిన మలయాళం మాటలు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నాం అంటూ టైటిల్ కార్డ్ లో వేస్తే బాగుంటుందని చెప్పారట…కానీ దర్శకుడు మాత్రం మలయాళం లో హీరోయిన్ మాట్లాడితేనే ఆ ఫీల్ బాగుంటుంది. దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే ఆ ఫీల్ పోతుందని చెప్పారట.
దాంతో అందరూ ఒకే అన్నారు. కానీ సినిమా ఇంటర్వెల్ లో మాత్రం హీరోయిన్ హీరోతో ఏదో మలయాళంలో చెప్పేసి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్లిపోయిన తర్వాత సునీల్ వచ్చి హీరోని ఆమె ఏం చెప్పిందిరా అని అడిగితే హీరో నాకేం అర్థం కాలేదు.
ఆమె ఐ లవ్ యు అని చెప్పిందా? లేదంటే చెప్పుతో కొడతాను అని చెప్పిందా? ఏది అర్థం అవ్వలేదు అని చెప్పడంతో థియేటర్ లో ఉన్న ప్రేక్షకులు సైతం మాక్కూడా అర్థం కాలేదని ఒక్కసారిగా అరిచారట. ఆ మిస్ కమ్యూనికేషన్ వల్లే సినిమా ప్రేక్షకులకు పెద్దగా చేరువవ్వలేదు అంటూ ఆయన తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.
మొత్తానికైతే సూపర్ హిట్ అవ్వాల్సిన సినిమా ఒక చిన్న తప్పు వల్ల ఫ్లాప్ అవ్వడం అనేది అప్పట్లో ప్రతి ఒక్కరిని బాధించింది… ఇక ఇప్పుడు వచ్చే ఏపీ కమింగ్ ఫిలిం మేకర్స్ అయిన ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా సినిమాని సక్సెస్ అయ్యే విధంగా ప్రణాళిక రూపొందించుకుంటే మంచిదని కొంతమంది మేకర్స్ సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…