Balakrishna: సీనియర్ ఎన్టీఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన బాలయ్య బాబు కెరియర్ స్టార్టింగ్ లో ఎక్స్పరిమెంటల్ సినిమాలను చేశాడు. ఆ తర్వాత వరుసగా మాస్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక ప్రస్తుతం కమర్షియల్ బ్లాక్ బాస్టర్లను అందుకోవాలనే ఉద్దేశ్యంతో రొటీన్ ఫార్ములాలో సినిమాలు చేస్తున్నాడు. సింహా సినిమా నుంచి అతని సినిమాలను చూసినట్లయితే కనక ప్రతి సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. ఒక బాలకృష్ణ ఫస్ట్ ఆఫ్ మొత్తాన్ని నడిపించడం, ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే బాలకృష్ణ సెకండ్ హాఫ్ లో వచ్చి అన్యాయం చేసే రౌడీలను అంత మొందించడం లాంటి కథలతోనే సినిమాలన్నీ తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే ఈ ఫార్ములా రొటీన్ రొట్ట ఫార్ములాగా మారిపోయింది.
అఖండ 2 సినిమాలో సైతం బాలయ్య బాబు చూపించిన నటన బాగున్నప్పటికి బోయపాటి కథ గాని, దానిని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన విధానం గాని బాలేదు. అందువల్లే సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేక పోయింది. ఇక బాలయ్య బాబు లాంటి నటుడితో సినిమా చేయాలంటే డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమాలను తెరకెక్కిస్తే బాగుంటుంది.
బాలయ్య ఏ జోనర్లో అయినా సినిమాలు చేసి మెప్పించగలిగే కెపాసిటీ ఉన్నవాడు కాబట్టి అతనితో డిఫరెంట్ సినిమా చేస్తే బాగుంటుంది. అంతే తప్ప మూస ధోరణిలో సాగే కమర్షియల్ సినిమాలను చేస్తూ ఇంకా ఎన్ని రోజులు బాలయ్య బాబుకి అదే జానర్ లో సక్సెస్ ని కట్టబెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు అంటూ చాలామంది సినిమా విమర్శకులు సైతం దర్శకులను విమర్శిస్తున్నారు…
ఇక బాలయ్య బాబు చేస్తున్న సినిమా లైనప్ బాగున్నప్పటికి ప్రస్తుతం గోపీచంద్ మలినేని తో చేస్తున్న సినిమా విషయంలో ఆయన తగు జాగ్రత్తలైతే తీసుకోవాలి. లేకపోతే మాత్రం ఆయన బొక్క బోర్లా పడే అవకాశాలైతే ఉన్నాయి. ఇప్పటిదాకా హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సినిమాలు చేశారు. కాబట్టి ఇప్పుడు కొంచెం ఎక్స్పరిమెంటల్ సినిమాలు చేస్తే బాగుంటుందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…