Mythri Movie Makers: తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే టాప్ ప్రొడ్యూసర్లుగా మారిన వారిలో మైత్రి మూవీ మేకర్స్ ఒకరు. ప్రస్తుతం వాళ్ల హవా నడుస్తుంది. ఇక రీసెంట్ గా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ప్లాప్ టాక్ ను తెచ్చుకోవడంతో వాళ్లకు కొంతవరకు నష్టాలు వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి… ఇక ఈ నష్టాల నుంచి వాళ్ళు బయటపడాలంటే రామ్ చరణ్ హీరోగా చేస్తున్న ‘పెద్ది’ సినిమా వస్తేనే వాళ్లకు ప్రాఫిట్స్ వస్తాయని వాళ్ళు భావిస్తున్నారు. ఆ సినిమా మీద దాదాపు 400 నుంచి 500 కోట్ల వరకు బడ్జెట్ ను కేటాయించారు. మరి ఆ బడ్జెట్ ని రికవరీ చేస్తూ ఉస్తాద్ కి వచ్చిన నష్టాన్ని సైతం భారతీ చేయగలిగే కెపాసిటీ పెద్ది సినిమాకి ఉందంటూ వాళ్ళు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ ఇదే.. ఏ మ్యాచ్ ఎప్పుడు ఎక్కడంటే?
ఇక ఏది ఏమైనా కూడా ఈ ఏప్రిల్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘పెద్ది’ సినిమా యావత్ ప్రపంచ స్థాయి ప్రేక్షకులందరిని ఆదరిస్తుందనే కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు. ఇక వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి పెను సంచలనాన్ని క్రియేట్ చేస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…
ఇక మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో సినిమాలను నిర్మించి భారీ సక్సెస్ సాధిస్తున్నారు. ‘పుష్ప 2’ సినిమాతో భారీ ప్రాఫిట్స్ ను మూట గట్టుకున్న వాళ్లు ఈమధ్య చేస్తున్న కొన్ని చిన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయినప్పటికి వాళ్ళు ఎక్కడా కూడా వెనకడుగు వేయడం లేదు. వచ్చే ప్రాఫిట్స్ ని మళ్ళీ సినిమాల మీద పెట్టుబడి గా పెట్టి సినిమాలు చేస్తున్నారు.
మొత్తానికైతే వాళ్లు ప్రస్తుతం ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ ప్రొడ్యూసర్ గా మారారు అంటే మామూలు విషయం కాదు. అలాగే ఒక సినిమాకి ఎంత బడ్జెట్ ని కేటాయించాలనే ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించి ముందుకు సాగుతున్నారు. కాబట్టే వాళ్ళు సక్సెస్ లను అందుకుంటున్నారు…