My Village Show Fame Gangavva: గంగవ్వ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఒక సాధారణ పల్లెటూరి వృద్ధ మహిళ సాధించిన విజయాలు అమోఘం. సోషల్ మీడియా యుగంలో టాలెంట్ ఉంటే ఎవరైనా వృద్ధిలోకి రావచ్చు, లక్షలు సంపాదించవచ్చు అనడానికి నిదర్శనం. సొంత ఊరిలో వ్యవసాయం పనులు చేసుకుంటూ కనీస సంపాదన లేక ఇబ్బందికర జీవితం అనుభవించిన గంగవ్వ యూట్యూబ్ సాయంతో సెలెబ్రిటీ అయ్యారు. ఆమెలోని ప్రత్యేకతను గమనించిన యువకులు మై విలేజ్ షో పేరుతో వీడియోలు చేసి యూట్యూబ్ లో విడుదల చేశారు. వాటికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.

గంగవ్వ వీడియోలకు మిలియన్స్ లో వ్యూస్ రావడం మొదలైంది.ఆమెకంటూ ఓ గుర్తింపు, అభిమానగణం ఏర్పడ్డారు. ఆ ఫేమ్ గంగవ్వకు బిగ్ బాస్ ఛాన్స్ తెచ్చిపెట్టింది. సీజన్ 4లో 19 మంది కంటెస్టెంట్స్ లో ఒకరిగా గంగవ్వ ఎంట్రీ ఇచ్చారు. అక్కడ కూడా గంగవ్వ సత్తా చాటారు. టైటిల్ గెల్చుకొని మంచి ఇల్లు కట్టుకోవాలనే కల నెరవేర్చుకుంటా అన్నారు. అయితే అనారోగ్య సమస్యలతో గంగవ్వ హౌస్ ని వీడాల్సి వచ్చింది. కాగా హోస్ట్ నాగార్జున ఆమెకు ఇల్లు నిర్మించుకోవడానికి సహాయం చేశాడు. స్టార్ మా ఇచ్చిన డబ్బులు, నాగార్జున సాయం చేసిన సొమ్ముతో కొత్త ఇల్లు నిర్మించుకుంది.
బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళాక ఆమె ఫేమ్ డబుల్ అయ్యింది. సినిమా అవకాశాలు మొదలయ్యాయి. టెలివిజన్ ఈవెంట్స్ లో సందడి చేస్తున్నారు. కొత్త సినిమా ప్రమోషన్స్ కి చిత్ర యూనిట్స్ గంగవ్వ సహాయం తీసుకుంటున్నాయి. ఆమె ఇంటర్వ్యూలు కూడా చేస్తున్నారు. మొత్తంగా ఆమె దశ తిరిగింది. ఎవరూ ఊహించని స్థాయికి ఎదిగిన గంగవ్వ ఎంత సంపాదిస్తున్నారో తెలుసుకోవాలనే ఆత్రుత అందిరికీ ఉంటుంది.
అందుతున్న సమాచారం ప్రకారం.. గంగవ్వ నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు. గంగవ్వ ఒక్కరోజు కాల్ షీట్ కి రూ. 10 వేలకు పైనే ఛార్జ్ చేస్తున్నారట. సినిమా షూటింగ్స్, బుల్లితెర ఈవెంట్స్ లో పాల్గొంటే రోజుకు ఆమె అంత తీసుకుంటున్నారు. ఇక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆమెకు నెలకు లక్ష రూపాయలకు పైనే వస్తాయట. తరచుగా ఆమె తన యూట్యూబ్ ఛానల్ లో వీడియోలు పోస్ట్ చేస్తారు. ఆమె వీడియోలకు మంచి ఆదరణ ఉంది. మొత్తంగా నెలకు అవకాశాలను బట్టీ రూ. 3 నుండి 5 లక్షల వరకు ఆమె సంపాదిస్తున్నట్లు సమాచారం. ఇది ఓ సీనియర్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సంపాదన కంటే ఎక్కువ కావడం విశేషం.