Shahrukh Khan- Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ #RRR నుండి వచ్చింది అనుకుంటే పెద్ద పొరపాటే..ఆయన రెండవ సినిమా మగధీర నుండే దేశవ్యాప్తంగా విపరీతమైన ఫాలోయింగ్ మరియు క్రేజ్ ఏర్పడింది..తనకి ఉన్న ఆ పాపులారిటీ తోనే అప్పట్లో ‘జంజీర్’ అనే సినిమా తీసాడు..ఈ చిత్రం తెలుగు లో తూఫాన్ పేరు తో విడుదలైంది..భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ లో పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది.

కానీ హిందీ లో ఈ సినిమా క్లోసింగ్ కలెక్షన్స్ ఈమధ్య విడుదలవుతున్న కొన్ని ఫ్లాప్ సినిమాలకు లేదు..అప్పట్లో ఈ చిత్రం హిందీ వెర్షన్ దాదాపుగా 25 కోట్ల రూపాయిలు వసూలు చేసింది..అంతే కాకుండా రామ్ చరణ్ సినిమాలకు యూట్యూబ్ లో హిందీ డబ్ వెర్షన్ కి వందల మిలియన్స్ లో వ్యూస్ కూడా వస్తుంటాయి..అంతటి పాపులారిటీ మరియు క్రేజ్ ఉన్న స్టార్ ఆయన..ఇక #RRR చిత్రం తర్వాత ఆ క్రేజ్ పదింతలు ఎక్కువ అయ్యింది.
ఇక లేటెస్ట్ గా రామ్ చరణ్ గురించి బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ట్విట్టర్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..అభిమానులు ఆ ట్వీట్ ని షేర్ చేస్తూ తెగ సంబరపడిపోతున్నారు..ఇక అసలు విషయానికి వస్తే షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ పఠాన్ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా నిన్న ట్విట్టర్ లో అభిమానులతో ఒక చాట్ సెషన్ ని నిర్వహించాడు.

ఈ సెషన్ లో ఒక అభిమాని రామ్ చరణ్ గురించి అడగగా, దానికి షారుఖ్ ఖాన్ రిప్లై ఇస్తూ ‘రామ్ చరణ్ నాకు చాలా పాత స్నేహితుడు..నా పిల్లలకు అతను మోస్ట్ ఫేవరెట్ హీరో’ అని చెప్తాడు..గతం లో రామ్ చరణ్ బ్రూస్లీ మూవీ షూటింగ్ సమయం లో షారుఖ్ ఖాన్ స్వయంగా రామ్ చరణ్ ని కలవడానికి షూటింగ్ స్పాట్ కి వచ్చాడు..అప్పట్లో వీళ్లిద్దరు కలిసిన ఫోటో మీడియా లో సెన్సేషనల్ గా మారింది..అలా రామ్ చరణ్ కి షారుఖ్ ఖాన్ తో పాటుగా సల్మాన్ ఖాన్ మరియు అమీర్ ఖాన్ తో కూడా మంచి రిలేషన్ ఉంది.