Thaman On Kuntur Karam: సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడవసారి ‘గుంటూరు కారం’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసారు, దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
అయితే ఈ సినిమా నుండి థమన్ తప్పుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. నిన్న రాత్రి కూడా థమన్ మహేష్ బాబు పై చాలా సెటైర్స్ వేస్తూ పరోక్షంగా తీవ్రంగా విరుచుకుపడ్డారు, నిన్న మొత్తం సోషల్ మీడియా లో ఈ విషయంపై అభిమానుల్లో గందరగోళం మొదలైంది.అసలు ఈ సినిమా ఉంటుందా లేదా ఆగిపోతుందా అనే సందేహాలు మొదలయ్యాయి. ఇక అసలు విషయానికి వస్తే ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ లేని కారణంగా ‘గుంటూరు కారం’ చిత్రానికి కొద్దిరోజులు బ్రేక్ ఇచ్చాడు మహేష్ బాబు.
జులై నుండి ఈ చిత్రం కొత్త షెడ్యూల్ షూటింగ్ విరామం లేకుండా సాగుతుందని అన్నారు, ముందుగా ఒక పాటతో షెడ్యూల్ ని ప్రారంభించాలి అనుకున్నారు. కానీ థమన్ నుండి ట్యూన్ మాత్రం నిన్నటి వరకు రాలేదట. అంత ఆలస్యం చేసి ఇచ్చిన ట్యూన్ కూడా మహేష్ బాబు కి ఏమాత్రం నచ్చలేదట.థమన్ ని మార్చమని మొదటి నుండి చెప్తూనే ఉన్నాను, మీరు మార్చడం లేదు, ఇప్పటికైనా మార్చండి అని త్రివిక్రమ్ తో మహేష్ బాబు అన్నాడట.
దీంతో మాట మాట పెరిగి ఇద్దరి మధ్య గొడవలు ఏర్పడ్డాయని, త్రివిక్రమ్ వెంటనే థమన్ ని తీసేశాడని , ఆయన స్థానంలోకి అనిరుద్ ని తీసుకోబోతున్నట్టుగా వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, థమన్ ఈ సినిమాకి పనిచేస్తున్నదని, జులై నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుందని ఆ చిత్ర నిర్మాత నాగ వంశీ అన్నాడు.అయితే ఈ చిత్రం నుండి పూజ హెగ్డే మాత్రం తప్పుకున్నట్టుగా తెలుస్తుంది.