Akhanda: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా అఖండ. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. సెన్సార్ కూడా కంప్లీ చేసుకుని విడుదలకు సిద్ధమైంది. డిసెంబరు 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికేట్‌ను ఇచ్చింది. కాగా, ప్రస్తుతం మిగిలున్న పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేసుకుంటూ ముందుకు దూసుకెళ్లిపోతోంది చిత్రబృందం. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, పాటలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
ముఖ్యంగా ఈ సినిమాలోని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో తమన్ ఫుల్ కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా, థమన్ పోస్ట్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్మా మారింది. అందులో అఖండ సినిమాకు సంబంధించిన రోర్ మ్యూజిక్ వినిపించింది. అయితే, ఈ ఇది సినిమాలోని సాంగో లేక బీజీఎమ్ఓ తెలియాల్సి ఉంది. ఏకంగా 126.9 హై లెవెల్ బేస్ లో కంపోజ్ చేస్తున్నట్టు చెబుతున్నాడు. అది వినడానికి కూడా మంచి హై ఇచ్చే లెవెల్లో మాసివ్ గా ఉంది. దీంతో, అభిమానులకు సినిమాపై మరించ అంచనాలు పెరిగిపోయాయి. మరి ఆ థ్రిల్‌ను ఎంజాయ్ చేయాలంటే.. డిసెంబరు 2 విడుదలయ్యేవరకు వేచి చూడాల్సిందే.
126.9 👀 #AkhandaOnDec2nd 🔊🔊🔊🎵🥁
AUM NAMA SHIVAYA 🙏 #AKHANDA 💪🏼✍️ pic.twitter.com/iEkanXXJmd
— thaman S (@MusicThaman) November 22, 2021
Also Read: Bangarraju Movie: వచ్చేస్తున్న నవ మన్మధుడు… బంగార్రాజు మూవీ నుంచి చైతూ కి బర్త్ డే గిఫ్ట్
ఇక ప్రస్తుతం బాలయ్య, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. ఆలాగే ఆ తర్వాత యంగ్ దర్శకుడు అనిల్ రావిపూడితో కూడా బాలయ్య ఓ సినిమా చేయబోతున్నాడు. అదేవిధంగా కొరటాల శివతో కూడా సినిమా ఉంటుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.
Also Read: Anil Ravipudi: దర్శకుడిగా ఇది నాకు ఆరో పుట్టినరోజు- అనిల్ రావిపుడి
