Harshavardhan Rameswaran: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించడం అంటే అంత ఆషామాషీ వ్యవహారమైతే కాదు. ప్రేక్షకులకు నచ్చే సినిమా తీయాలంటే దానికి మంచి కథ రాసుకోవాలి, హీరోల హీరోయిజం ను ఎలివేట్ చేస్తూ ప్రొడ్యూసర్స్ కి డబ్బులు వచ్చే విధంగా సినిమా ఉండాలి. అందులో ఏ ఒక్కటి తగ్గినా కూడా సినిమా ప్రేక్షకులకు రీచ్ అవ్వదు. అలాగే ప్రొడ్యూసర్ కి డబ్బులైతే రావు… హీరో తన మార్కెట్ ని పెంచుకోవడానికి అవకాశాలైతే ఉండవు. కాబట్టి వీటన్నింటిని బ్యాలెన్స్ చేస్తూ ఒక దర్శకుడు సినిమా చేయాల్సిన అవసరం ఉంది…ఇక సినిమా సక్సెస్ కి ప్రధాన బలం మ్యూజిక్… ఒక సినిమా జనాల్లోకి వెళ్లాలంటే ఆ సినిమా సాంగ్స్ అద్భుతంగా ఉండాలి. ప్రేక్షకులు థియేటర్ కి వచ్చే సినిమాని చూడాలి అంటే ఆ సాంగ్స్ విషయంలో వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు… అవన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడే ప్రేక్షకుడు థియేటర్ కి వచ్చి ఎంజాయ్ చేస్తాడు. ఇక ఇలాంటి సందర్భంలోనే దర్శకులు మ్యూజిక్ డైరెక్టర్లను తీసుకునే విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తారు. ఎవరిని పడితే వాళ్ళను సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్లుగా ఎంచుకోరు. సాంగ్స్ బాగా ఇస్తూనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద ఎక్కువ ఫోకస్ చేసే వాళ్లకి ఎక్కువ అవకాశాలైతే వస్తాయి.
ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో అనిరుధ్ తన మ్యూజిక్ తో అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ప్రేక్షకులను మ్యాజిక్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక రీసెంట్ గా ఓజీ సినిమాతో తమన్ సైతం చాలా మంచి బ్యా గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. దాంతో ఆయన పాన్ ఇండియాలో మరోసారి భారీ పాపులారిటిని సంపాదించుకున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే త్రివిక్రమ్ – వెంకటేష్ కాంబోలో వస్తున్న సినిమా కోసం గురూజీ తమన్ ను కాకుండా అనిమల్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అయిన హర్షవర్ధన్ రామేశ్వరన్ కు అవకాశం ఇచ్చాడు. ఇక ఈయన ఇంతకు ముందు సందీప్ రెడ్డి వంగ – రణబీర్ కపూర్ కాంబోలో వచ్చిన అనిమల్ సినిమాకి మ్యూజిక్ ను అందించాడు…ఆ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో ఆయనకి మంచి గుర్తింపు వచ్చింది…
ఇక త్రివిక్రమ్ – వెంకటేష్ సినిమాతో పాటుగా పూరి – సేతుపతి కాంబినేషన్లో వస్తున్న సినిమా విషయంలో కూడా హర్షవర్ధన్ రామేశ్వరన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఈ సినిమాలతో ఆయన మంచి మ్యూజిక్ ను అందించి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదుగుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…ఈ దెబ్బ తో అనిరుధ్, తమన్ పక్కకెళ్లి పోవాల్సిందే అంటూ మరికొంత మంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తుండటం విశేషం…