Pawan Kalyan: కొందరు హీరోలు ఏం చేసినా అదొక స్టైల్ గానే ఉంటుంది…చొక్కా మడిచిన, లో మోషన్ లో నడిచిన, జేబులో చేతులు పెట్టుకున్న, మెడ మీద చెయ్యితో నిమిరిన అదొక మేనరిజంగా ముద్రపడిపోతోంది. కొన్ని కోట్ల మంది అభిమానుల చేత అనుకరింపబడుతోంది…ఈ విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి స్థానంలో ఉంటాడు. ఆయన వేసుకున్న కాస్ట్యూమ్స్, ఆయన నడిచి వాకింగ్ స్టైల్ మెడ మీద చెయ్యి పెట్టుకొని స్టైల్ గా నవ్వడం వంటివి అభిమానులు చాలా ఇష్టంతో అనుకరిస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగాడు. కెరియర్ స్టార్టింగ్ లో వరుస సక్సెస్ లను సాధించిన ఆయన ప్రస్తుతం పాలిటిక్స్ లో కొంచెం బిజీగా ఉండడం వల్ల కంటిన్యూస్ గా సినిమాలను చేయలేకపోతున్నాడు. అభిమానుల కోరిక మేరకు అవకాశం దొరికిన ప్రతీసారి సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా సుజీత్ దర్శకత్వంలో చేసిన ‘ఓజీ’ సినిమా సైతం మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంతటి కలెక్షన్స్ ని రాబడుతోంది అనేదాని మీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఇప్పటికే 400 కోట్ల వరకు కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ సినిమా పాన్ ఇండియాలో పెను ప్రభంజనాలను సృష్టిస్తుండడం విశేషం…ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కాలర్ అక్కినేని హీరో పట్టుకున్నాడు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఇంతకీ ఆ అక్కినేని హీరో ఎవరు? ఎందుకని పవన్ కళ్యాణ్ కాలర్ పట్టుకోవాల్సి వచ్చింది అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులైతే చాలా వరకు చర్చించుకుంటున్నారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే ఓజీ సినిమాలో ఒకప్పటి హీరో వెంకట్ ఒక కీలక పాత్రలో నటించాడు. ఒక సన్నివేశంలో ఆయన పవన్ కళ్యాణ్ కాలర్ పట్టుకొని ఒక డైలాగ్ చెబుతాడు…
అది థియేటర్లో చాలా బాగా ఎలివేట్ అయింది. వెంకట్ అక్కినేని హీరో కాదు కదా! పవన్ కళ్యాణ్ కాలర్ పట్టుకుంది అక్కినేని హీరో అని కదా మనం మాట్లాడుకుంటున్నాం అనే సందేహం మనలో చాలామందికి వస్తోంది. నిజానికి వెంకట్ తను చేసిన మొదటి సినిమా ‘సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి’ అనే మూవీ ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద అక్కినేని వారు నిర్మించారు. ఇక ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన వెంకట్ ఆ తర్వాత అక్కినేని ప్రొడక్షన్లో కొన్ని సినిమాలు చేశాడు.
మొదట్లో ఇతను అక్కినేని వారసుడే అంటూ చాలామంది అపోహ పడ్డారు. అయినప్పటికి నాగేశ్వరరావు సైతం వెంకట ను తన ఫ్యామిలీ మెంబర్ల చూసుకునేవాడు. అప్పటినుంచి హీరో వెంకట్ అనగానే అక్కినేని వెంకట్ అంటూ పిలిచేవారని ఇండస్ట్రీలో తనకు ఒక మంచి గుర్తింపు వచ్చిందని వెంకట్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం విశేషం… ఇక మొత్తానికైతే సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి మంచి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…