Murali Mohan
Murali Mohan: సీనియర్ నటుడు, రాజకీయవేత్త మురళీ మోహన్ వ్యాపారవేత్తగా కూడా రాణించారు. ఆయన సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి కూడాను. మురళీ మోహన్ ఫౌండేషన్ తరపున పేదలకు సేవలు చేస్తున్నారు. కాగా మురళీ మోహన్ తాతగారు సుమారు 100 ఏళ్ల క్రితం ఒక భవనం నిర్మించారు. ఏలూరు జిల్లా చాటపర్రులో ఈ భవంతి ఉంది. ఈ పురాతన భవనం శిధిలావస్థకు చేరుకోకుండా మురళీ మోహన్ చర్యలు చేపట్టారు. ఆ భవనాన్ని ఆధునిక సౌకర్యాలతో ఆధునీకరించారు. రిపేర్లు చేయించాడు.
Also Read: నిద్ర లేని రాత్రులు గడుపుతున్న రామ్ చరణ్, జాన్వీ కపూర్..ఇదేమి డెడికేషన్ బాబోయ్!
పూర్వీకుల నుండి వచ్చిన వారసత్వ సంపదను కాపాడుకోవాలనే ఉద్దేశంతో మురళీ మోహన్, తాత నిర్మించిన భవనాన్ని రీ మోడల్ చేయించారు. ఈ సందర్భంగా గృహ ప్రవేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు హాజరయ్యారు. చాటపర్రులో గల సన్నిహితులు, బంధువులతో మురళీ మోహన్ ముచ్చటించారు. గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. తాతయ్య నిర్మించిన భవనంలో చార్టీటీ ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నారు.
మురళీ మోహన్ చేసిన పనిని అందరు ప్రశంసిస్తున్నారు. కాగా మురళీ మోహన్ ఇటీవల రాజమౌళి కుటుంబానికి బంధువు అయ్యారు. మురళీ మోహన్ మనవరాలిని కీరవాణి చిన్న కుమారుడు సింహ కోడూరి వివాహం చేసుకున్నాడు. మురళీ మోహన్ కొడుకు కుమార్తె అయిన రాగ తో సింహ పెళ్లయింది. రాగ, సింహ సైతం ఈ గృహ ప్రవేశ వేడుకకు హాజరయ్యారు. సింహ ఇటీవల మత్తువదలరా 2 ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీకి పాజిటివ్ వచ్చింది.
ఇక క్రమ శిక్షణతో మురళీ మోహన్ నటుడిగా ఎదిగాడు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందల చిత్రాల్లో నటించాడు. ఏడు పదుల వయసులో కూడా మురళీ మోహన్ ఆరోగ్యకర జీవితం గడుపుతున్నారు. దురలవాట్లకు దూరంగా ఉండటం, మంచి ఆహారం తీసుకోవడం ద్వారా తాను ఫిట్ గా ఉంటున్నట్లు ఆయన పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు.