ముమైత్ ఖాన్ ఓ డ్రైవర్ ను మోసం చేసిందంటూ సోషల్ మీడియాలో గత రెండు మూడు రోజులుగా ఓ వార్త వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ కు చెందిన క్యాబ్ డ్రైవర్ రాజు అనే అతను ముమైత్ తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదని.. తనని మోసం చేసిందని ఆరోపించాడు. మొత్తంగా రాజుకు ముమైత్ నుంచి రూ.15 వేలు రావాల్సి ఉందట. అయితే తాజాగా ముమైత్ ఖాన్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో క్యాబ్ డ్రైవర్ రాజు పై ఫిర్యాదు చేసింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అసలు నిజాలు ఇవి అంటూ తన గోడును చెప్పుకుంది.
Also Read: థియేటర్లు రెడీ.. సినిమాలు వచ్చేనా?..లైన్లో ఏమున్నాయి?
క్యాబ్ డ్రైవర్ రాజు తన పై చేసిన ఆరోపణలు పూర్తి అబద్దాలు అని, క్యాబ్ డ్రైవర్ రాజును, తాను గోవా ట్రిప్‌కు తీసుకెళ్లినప్పుడు అతనికి పూర్తిగా డబ్బులు చెల్లించానని, అయినా అతను డబ్బులు చెల్లించలేదని ఆరోపణలు చేస్తున్నాడు అని, అందుకు తగిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని ముమైత్ మొత్తానికి వివరణ ఇచ్చింది. పనిలో పనిగా డ్రైవర్ రాజు పై తన ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసింది. పైగా డ్రైవర్ రాజు నుంచి తనకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది ముమైత్. ఆ ఫిర్యాదులో రాజు ర్యాష్ డ్రైవింగ్‌కు పాల్పడ్డాడని, గోవా పర్యటనలో తనను భయాందోళనకు గురిచేసి వేధించాడని రాసుకోచ్చింది.
Also Read: చెన్నైతో రైనా.. భజ్జీ బంధానికి తెరపడనుందా?
ఇక చివర్లో ఒక క్యాబ్ డ్రైవర్‌ను మోసం చేసే క్యారెక్టర్ తనది కాదని ముమైత్ ఖాన్ మంచి ఎమోషనల్ డైలాగ్ ను కూడా ఒకటి చెప్పింది. అలాగే ఈ రాజు వ్యవహారంలో మీడియా తన క్యారెక్టర్‌ను కించపరిచేలా కథనాలు ప్రసారం చేసిందని బాధ పడుతూనే మీడియా మీద ముమైత్ ఖాన్ ఫైర్ అయినట్టు కాస్త ఆవేశంగా కనిపిచింది. ఇక ఇంత చెప్పాక ఆ ఒక్కటి ఎందుకు చెప్పకూడదు అనుకుందో ఏమో గాని డబ్బుల కోసం డ్రైవర్ రాజు తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, అతను తనను చంపేందుకు కూడా చూశాడని సెలవిచ్చింది ముమైత్. ఏంటో పాపం ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటూ టాలీవుడ్ ను అప్పట్లో ఓ ఊపే ఊపేసిన ముమైత్ ఖాన్ చివరకు డ్రైవర్ తో ఇలా రచ్చకెక్కడం బాధాకరమైన విషయమే.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Mumaith khan files complaint against cab driver
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com