Multistarrer film : రియల్ కథ తో వస్తున్న స్టార్ హీరోలు… సక్సెస్ వస్తుందా..?

ఇక అందులో భాగంగానే వీళ్ళ కాంబినేషన్ లో ఈ సినిమా వస్తుందంటూ డైరెక్టర్ సుధా కొంగర, హీరో సూర్య ఇద్దరు అనౌన్స్ చేయడం జరిగింది. ఇక ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించబోతున్నట్టుగా తెలుస్తుంది.

Written By: NARESH, Updated On : October 26, 2023 9:46 pm
Follow us on

Multistarrer film : ఇండస్ట్రీలో ప్రస్తుతం మల్టీస్టారర్ల హవా ఎక్కువగా కొనసాగుతుంది.అయితే రాజమౌళి తీసిన త్రిబుల్ ఆర్ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో మల్టీ స్టారర్ సినిమాకి గిరాకీ పెరిగింది. ఇక మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి చాలామంది హీరోలు ఉత్సాహం చూపిస్తున్నప్పటికీ మల్టీ స్టారర్ సినిమా చేయడానికి అవకాశం లేకపోయిన కూడా చాలా మంది హీరోలతో గెస్ట్ అప్పియరెన్స్ కూడా చేయిస్తున్నారు. అందులో భాగంగానే విక్రమ్ సినిమాలో సూర్య రోలెక్స్ అనే పాత్రలో ఆ సినిమా లో చివరి 10 నిమిషాలు కనిపించి సినిమా మొత్తాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. అయితే విక్రమ్ సినిమా సక్సెస్ లో సూర్య పోషించిన చివరి 10 నిమిషాలే హైలెట్ అయిందని ఇప్పటికి చాలామంది ఆ ఎపిసోడ్ కోసమే ఆ సినిమాని రిపీటెడ్ గా చూస్తూ వచ్చారు. ఒక సినిమాలో ఒక పాత్ర అనేది స్ట్రాంగ్ గా ఉంటే ఆ సినిమా ఎంత బాగా సక్సెస్ అవుతుంది అనేది దానికి రోలెక్స్ పాత్ర ని ఒక ఉదాహరణగా చెప్పవచ్చు…

ఇక అందులో భాగంగానే చాలా రోజుల నుంచి తమిళ్ సూపర్ స్టార్ అయిన సూర్య, మలయాళం సూపర్ స్టార్ అయిన దుల్కర్ సల్మాన్ హీరోలుగా ఒక సినిమా రాబోతుంది అంటూ నెట్లో ఒక వార్త హల్చల్ చేస్తుంది.అయితే ఇప్పుడు వీళ్ళ కాంబోకి సంబంధించిన ఒక న్యూస్ అనేది అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. డైరెక్టర్ సుధా కొంగర సూర్య కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన సూరారై పోట్రు (ఆకాశం నీ హద్దు రా) అనే సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇక అందులో భాగంగానే వీళ్ళ కాంబినేషన్ లో ఈ సినిమా వస్తుందంటూ డైరెక్టర్ సుధా కొంగర, హీరో సూర్య ఇద్దరు అనౌన్స్ చేయడం జరిగింది. ఇక ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమా తమిళనాడులోని వాస్తవ సంఘటనల ఆధారంగా గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో సాగే కథ గా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తుంది… ఈ సినిమా వర్కింగ్ టైటిల్ వచ్చేసి #suriya 43 అనే టైటిల్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు…ఇక ఈ సినిమాలో నజ్రియా,బాలీవుడ్ స్టార్ నటుడు అయిన విజయ్ వర్మ లాంటి పలువురు నటులు కూడా నటిస్తున్నారు. ఇక ఇంతకు ముందు వాస్తవ కథ ఆధారంతో తెరకెక్కిన ఆకాశం నీ హద్దురా అనే సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో దానికి ఏమాత్రం తీసుపోకుండా ఈ సినిమా కూడా భారీవిజయాన్ని సాధించేలా తెరకెక్కించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…ఇక ఇప్పటికే సుధా కొంగర సూరారై పోట్రు (ఆకాశం నీ హద్దురా) సినిమాని అక్షయ్ కుమార్ హీరోగా బాలీవుడ్ లో చేస్తున్నట్టు గా రీసెంట్ గా ప్రకటించారు…