బన్నీ చిత్రంలో బహు భాషా నటులు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న ‘పుష్ప’ మూవీ భారీ బడ్జట్ తో పాటు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా తయారౌతోంది . పాన్ ఇండియా సినిమాగా ` పుష్ప ` చిత్రాన్ని ఆవిష్కరించడానికి సుకుమార్ యూనిట్ బాగానే కష్టపడుతున్నారు. ఆ క్రమంలో పాన్ ఇండియా స్థాయి నటీనటులను ఈ చిత్రం లోకి తీసు కొంటున్నారు. తాజా సమాచారం ప్రకారం ` పుష్ప` చిత్రం లో కన్నడ […]

Written By: admin, Updated On : April 14, 2020 10:40 am
Follow us on


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న ‘పుష్ప’ మూవీ భారీ బడ్జట్ తో పాటు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా తయారౌతోంది . పాన్ ఇండియా సినిమాగా ` పుష్ప ` చిత్రాన్ని ఆవిష్కరించడానికి సుకుమార్ యూనిట్ బాగానే కష్టపడుతున్నారు. ఆ క్రమంలో పాన్ ఇండియా స్థాయి నటీనటులను ఈ చిత్రం లోకి తీసు కొంటున్నారు. తాజా సమాచారం ప్రకారం ` పుష్ప` చిత్రం లో కన్నడ స్టార్ హీరో దర్శన్ ని నటింప చేయాలని సుకుమార్ ప్రయత్నిస్తున్నాడట..కాగా అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ `ఊర్వశి రౌటెలా` ను ఫైనల్ చేసిందట చిత్రబృందం.

మైత్రీమూవీస్, ముత్యం శెట్టి మీడియా బ్యానర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ఓ బాలీవుడ్ నటుడిని విలన్ గా నటింప చేయాలనుకుంటున్నారట..ఇకపోతే చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా తెరకెక్కనుంది. కాగా ఈ సినిమా కోసం బన్నీ చిత్తూరుజిల్లా యాసను ప్రత్యేకంగా నేర్చుకున్నాడు. కాగా ఈ చిత్రంలో బన్నీకి జోడీగా వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న కథానాయికగా నటించనుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.. మొత్తానికి అన్నిభాషల సినీ ఇండస్ట్రీస్ నుండి `స్టార్ ` లను తీసుకుని `పుష్ప’ సినిమా రేంజ్ ను పెంచుతున్నారు. ఇక కరోనా ప్రభావం తగ్గగానే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవడమే తరువాయి . ..