Homeఅప్పటి ముచ్చట్లుMullapudi Venkata Ramana: ఆయన సినిమాల్లో అవి ఒకదానితో ఒకటి కలిసి పోయేవి !

Mullapudi Venkata Ramana: ఆయన సినిమాల్లో అవి ఒకదానితో ఒకటి కలిసి పోయేవి !

Mullapudi Venkata Ramana

Mullapudi Venkata Ramana:  తెలుగు సినిమాల్లో పరిపూర్ణమైన హాస్యం ఉంది అంటే.. దానికి కారణం కొందరు మహా రచయితలే. వారిలో ముళ్ళపూడి వెంకటరమణ ఒకరు. ఆయన సాహిత్యంలోనూ, సినిమా రచనలోనూ ఎన్నో మధురమైన హాస్య గుళికలు ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ముళ్ళపూడి సాహిత్యం చాలా గొప్పగా ఉంటుంది. కారణం ఆయన రచన అన్నీ కావాల్సిన పాళ్ళలో ఉంటుంది.

రమణ గారు అనగానే వెంటనే బాపూ గారు కూడా గుర్తొస్తారు. వీళ్లద్దరూ తీసిన సినిమాలు అప్పటి తరాన్ని నవ్వుల లోకంలో ముంచాయి. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ నటించిన ‘పెళ్లి పుస్తకం’, మిస్టర్ పెళ్ళాం, శ్రీకాంత్ నటించిన ‘రాధాగోపాలం’, చంద్రమోహన్ నటించిన ‘బంగారు పిచ్చుక’ ఇలా చెప్పుకుంటూ పోతే ఆనాటి సంపూర్ణ రామాయణం నుంచి ఈనాటి శ్రీరామరాజ్యం వరకు ఎన్నో విజయవంతమైన సినిమాలు రాశారు ముళ్ళపూడి వారు.

అదేంటో ఆయన సినిమాలు ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపిస్తుంది. కారణం ఆయన సినిమాల కథల్లో సహజత్వం ఉంటుంది. పైగా సంగీతం కూడా చాలా అద్భుతంగా కుదురుతుంది. సంగీతాన్ని దృష్టిలో పెట్టుకుని సీన్స్ రాసిన మహా రచయిత ముళ్ళపూడి. అందుకే, ఆయన సినిమాల్లో కథ – సంగీతం ఒకదానితో ఒకటి కలిసి పోయేవి. పాట చూసిన సినిమా చూసిన అదే గొప్ప అనుభూతి కలుగుతుంది.

అంత గొప్పగా కథలు రాసేవారు ఆయన. అసలు సంగీతం గురించి ఆలోచిస్తూ కథ రాసేది ఒక్క ముళ్ళపూడి ఒక్కరే అనుకుంటా. అలాగే తన సినిమాల్లో కథానాయకుల సీన్స్ ను ఎంతో అందంగా రాసేవారు. ఆ సీన్స్ కారణంగా ఆయన సినిమాల్లో హీరోయిన్స్ కూడా ఎంతో అందంగా కనిపించేవారు.

ఇక ముళ్ళపూడి పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే రచనలలో ‘కానుక’, ‘కోతి కొమ్మచ్చి 3 భాగాలు’ ‘బాపూ రమణీయం’. అదే సినిమా రచనలకి వస్తే ‘పెళ్ళి పుస్తకం’ లాంటి సినిమాలు. అన్నట్టు ముళ్ళపూడి వారు రాసిన డైలాగులు అద్భుతం. అయన చమక్కులు – లిమరిక్కులు సినిమా స్థాయిని పెంచే విధంగా ఉండేవి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular