Homeఎంటర్టైన్మెంట్Kangana: పద్మశ్రీ ప్రభావం వల్లే కంగనా ఇలా ప్రవర్తిస్తోందా?

Kangana: పద్మశ్రీ ప్రభావం వల్లే కంగనా ఇలా ప్రవర్తిస్తోందా?

Kangana: ప్రస్తతం బాలీవుడ్​ కాంట్రవర్సీ క్వీన్​గా హాట్​టాపిక్​లో నలుస్తోంది కంగనా రనౌత్​. ఇటీవల పద్మశ్రీ అవార్డు అందుకున్న కంగనా.. ఆ తర్వాత స్వాతంత్య్రంపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను దుమారం రేపాయి. దేశానికి 2014లో మోదీ ప్రభుత్వంతో స్వాతంత్య్రం వచ్చిందంటూ.. బ్రిటిష్​ వారు పెట్టింది భిక్ష అని వ్యాఖ్యానించింది. దీంతో కంగనాపై నెటిజన్లు ఫైర్ అయ్యారు. పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు కూడా ఈ విషయంపై స్పందించారు. ఈ క్రమంలోనే పలు చోట్ల కంగనాపై కేసులు కూడా నమోదయ్యాయి.

kangana
Kangana

Also Read: ఈ హీరోయిన్ల రియల్ ఫేస్ లుచూస్తే కిందపడిపోతారు..!

కాగా, ఈ వివాదం సర్దుమనగకముందే.. తాజాగా కంగనా చేసినవ్యాఖ్యలపై సీనియర్ నటుడు ముఖేష్​ ఖన్నా స్పందించారు. కంగనా వ్యాఖ్యలు చిన్నపిల్లల చేష్టల్లగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. అటువంటి చర్య అజ్ఞానాన్ని ప్రదర్శిస్తోందని అన్నారు. కంగనాపై పద్మశ్రీ దుష్ప్రభావం చూపిందిందా ఏంటి?.. అని ఆయన ప్రశ్నించారు.

ఈ మేరకు ఇన్​స్టాగ్రామ్​ వేదికగా పోస్ట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు ముఖేశ్​. అందలో కంగనా ఫొటోను షేర్​ చేస్తూ.. దేశ స్వాతంత్య్రంపై మీరు చేసిన వ్యాక్యలు చాలా హాసాస్పదం. అసలు ఇది నీ అజ్ఞానానికి నిదర్సనమా.. లేక పద్మ శ్రీ అవార్డు ప్రభావమో తెలియట్లేదని అన్నారు. కాగా, ఇటీవలే వ్యవసాయ చట్టాల బిల్లు రద్దుపైనా కంగనా తనదైశ స్టైల్​లో ట్వీట్ చేసింది.  ఇది ఒక పిరికిపంద చర్యగా పేర్కొంటూ మోదీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టింది. ఇకపై దేశంలో జిహాదీలతో నిండిపోతుందని పేర్కొంది.

Also Read: నయా ట్రెండ్ సెట్ చేసిన మలయాళ ముద్దుగుమ్మలు!

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular