Four Region boards in Ap: ఎన్ని అడ్డంకులు ఎదురైనా మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గేది లేదని సీఎంజగన్ తో పాటు వైసీపీ నాయకులు చెప్పారు. కానీ ఈనెల 23న జగన్ అసెంబ్లీలో త్రి క్యాపిటల్స్ రద్దు ప్రకటన చేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వీటి రద్దు వెనుక సాంకేతిక కారణాలు అని జగన్ చెబుతున్నాఅసలు విషయం వేరే ఉందని చర్చించుకుంటున్నారు. వచ్చే ఎన్నికల కోసం జగన్ ఇప్పటి నుంచే వ్యూహాలు పన్నుతున్నాడని, అందులో భాగంగా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్న ఈ విషయంలో వెనక్కి తగ్గాలని ఆలోచించినట్లు సమాచారం.అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మూడు రాజధానులను ప్రకటించగానే ఆయా ప్రాంతాల్లో ఆశలు వెల్లివిరిశాయి. తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ జగన్ తాజా నిర్ణయంతో వారు నిరాశ చెందారు. అయితే వెంటనే జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తరువాత టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. అందుకు సీఆర్టీఏ చట్టాన్ని కూడా తెచ్చింది. అయితే 2019 జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని అందుకు మూడు రాజధానులు అవసరమని చెప్పారు. ఇందులో భాగంగా అప్పటి వరకు ఉన్న అమరావతితో పాటు విశాఖపట్నం, కర్నూలు జిల్లాలు కూడా రాజధానులుగా ప్రకటించారు. అందుకు సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి దానిని ఆమోదింప చేశారు.
Also Read: తగ్గేదేలే! జస్ట్ గ్యాప్ ఇచ్చాడంతే.. ఏపీ రాజధానిపై జగన్ సంచలనం
అయితే అప్పటి వరకు అమరావతి రాజధాని అని ఎన్నో ఆశలు పెట్టుుకున్న వారు కొందరు రైతులు తమ భూములను త్యాగాలు చేశామని పోరాటలు చేస్తున్నారు. అంతేకాకుండా మూడురాజధానుల విషయంలో న్యాయపరమైన చిక్కులు అధికంగా ఉండడంతో ఈ విషయంలో వెనుకడుగు వేయక తప్పలేదు. దీంతో వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే మూడు రాజధానుల బిల్లును రద్దు చేస్తున్నా.. ఆ ప్రాంతాల అభివృద్ధికి మాత్రం కట్టుబడి ఉన్నామని అంటున్నారు. ఇందులో భాగంగా ప్రతీ ప్రాంతానికి ప్రాంతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేసి అభివృద్ధి చేయనున్నట్లు సమాచారం.
రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల అభివృద్ధికి ప్రాంతీయ మండళ్లు ఏర్పాటు కానున్నాయి. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల కోసం విశాఖ కేంద్రంగా ఏర్పాటు కానుంది. అలాగే ఉభయ జిల్లాలతో పాటు కృష్ణ జిల్లాలల కోసం రాజమండ్రి వేదికగా మరో మండలిని ఏర్పాటు చేయనున్నారు. ఇక గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల కోసం ఇంకో ఒంగోలు కేంద్రంగా మండలిని ఏర్పాటు చేస్తారు. సీమ జిల్లాల కోసం కర్నూలు కేంద్రంగా మరో మండలిని ఏర్పాటు చేస్తారు. ఇలా ప్రాంతీయ మండళ్లు ఏర్పాటు చేసి వాటి అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. వీటిలో స్థానిక ప్రజాప్రతినిధులు సభ్యులుగా ఉండి వారి ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడుతారు.
Also Read: విశాఖపట్నమే ఏపీకి ఏకైక రాజధాని.. సంచలన నిర్ణయం దిశగా జగన్?