ప్చ్.. తన చావు వార్తలు విని విసిగిపోయాడట !

బతికి ఉన్న నటీనటులను చంపడం మీడియా అనాదిగా చేస్తోన్న పొరపాటు. తాజాగా తనకున్న ఆ అలవాటులో మళ్ళీ ఆ పొరపాటును చేసింది మీడియా. పాపం ఓ నటుడు బతికి ఉండగానే, చనిపోయాడు అని కథనాలను పుట్టించింది. దాంతో ‘నేను బతికే ఉన్నాను మహాప్రభో’ అంటూ ఆ నటుడు మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. ఇంతకీ విషయం ఏమిటంటే కోవిడ్‌ కారణంగా బాలీవుడ్‌ నటుడు ముఖేష్‌ ఖన్నా చనిపోయాడు అంటూ కొన్ని వెబ్ సైట్స్ రాసుకొచ్చాయి. ఆ న్యూస్ […]

Written By: NARESH, Updated On : May 12, 2021 2:52 pm
Follow us on

బతికి ఉన్న నటీనటులను చంపడం మీడియా అనాదిగా చేస్తోన్న పొరపాటు. తాజాగా తనకున్న ఆ అలవాటులో మళ్ళీ ఆ పొరపాటును చేసింది మీడియా. పాపం ఓ నటుడు బతికి ఉండగానే, చనిపోయాడు అని కథనాలను పుట్టించింది. దాంతో ‘నేను బతికే ఉన్నాను మహాప్రభో’ అంటూ ఆ నటుడు మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. ఇంతకీ విషయం ఏమిటంటే కోవిడ్‌ కారణంగా బాలీవుడ్‌ నటుడు ముఖేష్‌ ఖన్నా చనిపోయాడు అంటూ కొన్ని వెబ్ సైట్స్ రాసుకొచ్చాయి.

ఆ న్యూస్ చూసిన కొందరు విషయాన్ని ముఖేష్‌ ఖన్నా దగ్గరకు తీసుకువెళ్లారు. దాంతో కోపంతో ఊగిపోయిన ‘ముఖేష్‌ ఖన్నా’, తానూ చనిపోయానంటూ వస్తున్న వార్తల పై, అలాగే ఆ వార్తలను రాసిన వారి పై తీవ్రంగా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. అసలు తనకు కరోనా సోకలేదని, తానూ ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని ఓ వీడియోలో క్లారిటీ ఇచ్చి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఆ వీడియోలో ముఖేష్‌ ఖన్నా ఏం చెప్పాడంటే.. ఆయన మాటల్లోనే.. “మీరందరి ఆశీర్వాదాల వల్ల నేను సంపూర్ణ ఆరోగ్యంతో బతికే ఉన్నాను. నాకు కోవిడ్‌ వచ్చిందని, ఆస్పత్రిలో చేరానని, నేను చనిపోయాను అని వస్తోన్న ఇలాంటి వార్తలు పూర్తి అవాస్తవం. నిజానికి నాకు కరోనానే రాలేదు. మరి ఇలాంటి చెత్త పుకార్లను ఎవరు ఎందుకు పుట్టిస్తున్నారో ? ఏం చేస్తే వాళ్ళు ఇలాంటి నీచమైన ప్రచారాలను మానేస్తారు?

ఒక విధంగా సోషల్‌ మీడియా కూడా ఇందుకు ఒక కారణం. కానీ ఇలా ఫేక్‌ న్యూస్‌ లతో ప్రజల ఎమోషన్లతో ఆడుకోవడం సమాజానికి మంచిది కాదు. కాబట్టి, ఇలాంటి అసత్య ప్రచారాలు చేసే వారిని కఠినంగా శిక్షించి తీరాలి. నేను అయితే నా చావు వార్తలు విని పూర్తిగా నేను విసిగి వేసారిపోయాను” అని ముఖేష్‌ ఖన్నా బాధ పడుతూనే ఎమోషనల్ గా తన ఆవేదనను తెలియజేశారు.