https://oktelugu.com/

పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకి ముహూర్తం ఫిక్స్ !

ఇక రాజకీయాలు మాత్రమే చేస్తానని సినిమాలు చేయనని ప్రకటించి అభిమానులకి షాక్ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అప్పటికే ఒప్పుకున్న కొన్ని సినిమాలను కూడా క్యాన్సల్ చేసాడు. ఆయన కోసమే కథలు రాసుకుని ఎప్పటికైనా ఆయనతో సినిమా చెయ్యాలని ఎదురు చూస్తున్న ఎందరో దర్శకనిర్మాతలు బాగా నిరుత్సాహపడ్డారు. కానీ అకస్మాత్తుగా కొన్ని తప్పని పరిస్థితుల వల్ల మరల సినిమాలు చెయ్యటం స్టార్ట్ చేయడంతో.. నిర్మాతలు మరియు దర్శకులు క్యూ కట్టారు. ముందుగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో […]

Written By:
  • admin
  • , Updated On : December 20, 2020 / 06:57 PM IST
    Follow us on


    ఇక రాజకీయాలు మాత్రమే చేస్తానని సినిమాలు చేయనని ప్రకటించి అభిమానులకి షాక్ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అప్పటికే ఒప్పుకున్న కొన్ని సినిమాలను కూడా క్యాన్సల్ చేసాడు. ఆయన కోసమే కథలు రాసుకుని ఎప్పటికైనా ఆయనతో సినిమా చెయ్యాలని ఎదురు చూస్తున్న ఎందరో దర్శకనిర్మాతలు బాగా నిరుత్సాహపడ్డారు. కానీ అకస్మాత్తుగా కొన్ని తప్పని పరిస్థితుల వల్ల మరల సినిమాలు చెయ్యటం స్టార్ట్ చేయడంతో.. నిర్మాతలు మరియు దర్శకులు క్యూ కట్టారు. ముందుగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బాలీవుడ్ చిత్ర నిర్మాత బోనీ కపూర్‌తో కలిసి ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ‘వకీల్ సాబ్ ‘ సినిమా షూటింగ్ ప్రస్తుతం క్లైమాక్స్ స్టేజ్‌లో ఉంది.

    Also Read: అభిమానులకి షాక్ ఇచ్చిన ‘పాయల్ రాజ్‌పుత్’ !

    ఇక దీని తర్వాత హరిశంకర్, క్రిష్, సురేందర్ రెడ్డి, రామ్ తాళ్లూరి, సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో ఐదు సినిమాలు కమిట్ అయ్యారు పవన్. ‘వకీల్ సాబ్ ‘ మూవీ తర్వాత దర్శకుడు హరీష్ శంకర్ మూవీ స్టార్ట్ అవుతుందని అన్నారు. అలానే సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో మలయాళం మూవీ “అయ్యప్పనుమ్ కోశియుమ్” రీమేక్ ని వరుసలో చివరిగా అనౌన్స్ మెంట్ చేశారు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి ఈ సినిమానే వకీల్ సాబ్ మూవీ తర్వాత చేస్తున్నారన్న సమాచారం ఫిలిం నగర్ లో వినబడుతుంది. డిసెంబ‌ర్ 21న అనగా సోమ‌వారం నాడు ఈ సినిమాను లాంఛ‌నంగా ప్రారంభిస్తార‌ట‌.

    కాగా “అయ్యప్పనుమ్ కోశియుమ్” రీమేక్ లో పవన్ కళ్యాణ్ తో పాటు ‘దగ్గుబాటి రానా’ కూడా ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఈ సినిమాకి దర్శకుడు సాగర్ చంద్ర అయినప్పటికీ త్రివిక్రమ్ స్క్రిప్ట్ దగర నుండి అంతా చూసుకుంటున్నాడట .ఈ సినిమాను త్రివిక్ర‌మ్ ముందుండి న‌డిపించ‌డంతో ప‌వ‌న్ కూడా సినిమాను ముందుగా పూర్తి చేయ‌డానికి ఓకే చెప్పాడట‌. ప‌వ‌న్ ఇమేజ్‌ తగ్గట్లు కథలో కొన్ని కీలక మార్పులు చేసినట్లు తెలుస్తుంది.

    Also Read: అరియనా క్యారెక్టర్ అలాంటిదే… వర్మ సంచలన కామెంట్స్

    ప్రస్తుతం రానా నటిస్తున్న ‘విరాటపర్వం’ షూటింగ్ ఈ నెలాఖరుకి కంప్లీట్ అవుతుందట . అలానే పవన్ కూడా ఈ నెలలో వకీల్ సాబ్ షెడ్యూల్ పూర్తి చేస్తాడు. ఇద్దరి హీరోల డేట్స్ కాళీ అవటం మరియు ఫుల్ స్క్రిప్ట్ రెడీగా ఉండటంతో వెంటనే షూటింగ్ చేయటానికి నిర్మాత చినబాబు అంగీకరించాడట. జ‌న‌వ‌రి మొద‌టి వారంలో రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంద‌ని అంటున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్