https://oktelugu.com/

Mufasa The Lion King: లయన్ కింగ్ : ముఫాసా మూవీ యూఎస్ఏ రివ్యూ…

ఒకప్పుడు అనాధ పిల్లలుగా వచ్చిన వారు రాజ్యాన్ని ఎలా ఆక్రమించారు అనేది వివరిస్తూ ఉంటుంది... ఇక అందులో భాగంగానే ముపాసా తన తల్లిదండ్రులు నుంచి వరదల్లో చిక్కుకొని ఎలా విడిపోయింది ఇక్కడికి ఎలా వచ్చింది

Written By:
  • Gopi
  • , Updated On : December 19, 2024 / 01:03 PM IST

    Mufasa The Lion King

    Follow us on

    Mufasa The Lion King: లయన్ కింగ్ పేరుతో హాలీవుడ్ నుంచి వచ్చిన ఒక సినిమా యావత్తు ప్రపంచాన్ని కుదిపేసిన విషయం మనకు తెలిసిందే… ఇక ఇప్పుడు దానికి కొనసాగింపుగా మాఫాసా పేరుతో మరొక సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇండియాలో ఈ సినిమా రేపు రిలీజ్ అవ్వబోతున్న క్రమంలో ఇప్పటికే హాలీవుడ్ లో ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోస్ స్టార్ట్ చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా లేదా హాలీవుడ్ ప్రేక్షకులలో ఈ సినిమా మీద ఎలాంటి స్పందన వస్తుందనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    కథ

    ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే లయన్ కింగ్ రఫికి ముఫాసా యొక్క కథను కీయారా టిమోన్ లకు వివరిస్తుంది… ఒకప్పుడు అనాధ పిల్లలుగా వచ్చిన వారు రాజ్యాన్ని ఎలా ఆక్రమించారు అనేది వివరిస్తూ ఉంటుంది… ఇక అందులో భాగంగానే ముపాసా తన తల్లిదండ్రులు నుంచి వరదల్లో చిక్కుకొని ఎలా విడిపోయింది ఇక్కడికి ఎలా వచ్చింది.. రాజ్యాన్ని గా దక్కించుకుంది…ఫైనల్ గా తను అనుకున్న దానిని చేరుకుందా లేదా అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

    విశ్లేషణ

    ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ప్రతి సీన్ కూడా దర్శకుడు చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేసినట్టుగా తెలుస్తోంది…. ఇక ఇప్పటికే యూఎస్ఏ లో ఈ సినిమాని చూసిన ప్రేక్షకులు అందరూ సినిమా మీద పాజిటివ్ రెస్పాన్స్ ని తెలియజేస్తున్నారు.

    ఇక ఏది ఏమైనా కూడా మొదటి పార్ట్ కంటే కూడా దీన్ని చాలా ఎక్స్ట్రాడినర్ గా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు అంటూ వార్తలు వస్తున్నాయి… ఇక దానికి తగ్గట్టుగానే ముఫాసా ఎదుర్కొనే ఇబ్బందులు తను ఇక్కడ ఎలా మొనగాడనేది అలాగే తన తోటి మిత్రులతో కలిసి ఎలా పోరాటం చేసింది. అనేది దర్శకుడు బాగా చెప్పినప్పటికీ సెకండాఫ్ లో మాత్రం జఫ్ఫాన్సన్ అందించిన స్క్రీన్ ప్లే కొంచెం బోరింగ్ గా అనిపించినట్టుగా ప్రేక్షకులు తెలియజేస్తున్నారు.

    అది ఇంకొంచెం గ్రిప్పింగ్ గా రాసుకొని ఉంటే సినిమా చాలా బాగా వచ్చిండేదని ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా లయాన్ కింగ్ ను బీట్ చేయాలి అంటే ముఫాసా వల్ల కాలేదని మరికొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తూ ఉండడం విశేషం…

    టెక్నికల్ అంశాలు

    ఇక ఈ సినిమా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ప్రతి ఒక్క క్రాఫ్ట్ కూడా వాళ్ళ ప్రాణం పెట్టి వర్క్ చేసినట్టుగా కనిపిస్తుందట. ఇక విజువల్ గా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండడమే కాకుండా టెక్నాలజీని బాగా వాడుకొని మరి ఈ సినిమాను డిజైన్ చేశారు అంటూ మరి కొంతమంది సినిమా చూసిన యుఎస్ఏ ప్రేక్షకులు వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తూ ఉండటం విశేషం… ఇక దర్శకుడు కంప్లీట్ గా మనల్ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాడంటూ ప్రతి ఒక్కరు ఈ సినిమా మీద కామెంట్లు అయితే చేస్తున్నారు…ఇక ఏది ఏమైనా కూడా ఇండియాలో ఈ సినిమాని చూడాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే…