Homeఎంటర్టైన్మెంట్Mufasa The Lion King: లయన్ కింగ్ ట్రైలర్ వచ్చేసింది... ముఫాస నెక్స్ట్ లెవల్ అంతే...

Mufasa The Lion King: లయన్ కింగ్ ట్రైలర్ వచ్చేసింది… ముఫాస నెక్స్ట్ లెవల్ అంతే…

Mufasa The Lion King: ప్రస్తుతం ఆనిమేటెడ్ సినిమాలకి కూడా మంచి గిరాకీ ఉంది. ఇక ముఖ్యంగా ‘లయన్ కింగ్’ పేరుతో వచ్చిన సినిమా అప్పట్లో ఒక పెను సంచలనాన్ని సృష్టించింది. ఈ సినిమాలో ముఫాస ఎప్పటికప్పుడు తన రాజ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే తన తమ్ముడు స్కార్ కి క్యారెక్టర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ క్యారెక్టర్ కూడా జనాలకి గుర్తుండిపోతుంది.

ఇక ముఫసా కి సింబా అనే కొడుకు కూడా ఉంటాడు. ఆ క్యారెక్టర్ కూడా చాలా మందికి గుర్తుండిపోతుంది.ఈ సినిమాకి సిక్వెల్ గా లయన్ కింగ్ 2 కూడా వచ్చింది. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. ఇక ఇదిలా ఉంటే దీనికి ఫ్రీక్వల్ గా ఇప్పుడు మరొక సినిమాను తీసుకు వస్తున్నారు. అకాడమీ అవార్డు విజేత ‘బారి జెంకిన్స్’ లయన్ కింగ్ ఫ్రీక్వెల్ లో కూడా ముఫాస తన జీవితంలో ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుకుంటూ ఎలా వచ్చింది అనే ప్రాసెస్ ని చూపించే ప్రయత్నం చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది…

ఇక రీసెంట్ గా లయన్ కింగ్ ఫ్రీక్వెల్ కు సంబంధించిన ట్రైలర్ ని కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ఈ ట్రైలర్ కి కూడా ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభిస్తుంది. ఇక లయన్ కింగ్ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ అయితే వచ్చిందో ఈ ప్రీక్వెల్ కి కూడా అంతకుమించి రెస్పాన్స్ వస్తుందంటూ మేకర్స్ ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే లయన్ కింగ్ సినిమాలోని కొన్ని సీన్లని బాహుబలి సినిమాలో కూడా రిఫరెన్స్ గా వాడుకున్నారు.

ఈ సినిమా మొత్తం స్టోరీ బాహుబలి స్టోరీ ఒకేలా ఉంటుంది. అంతటి మ్యాజిక్ చేసిన ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నందుకు ప్రేక్షకులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు…
Mufasa: The Lion King | Official English Trailer | In Cinemas 20 December

Exit mobile version