https://oktelugu.com/

Muddy Movie: “మడ్డీ” సినిమా తెలుగు హక్కులను దక్కించుకున్న దిల్ రాజు…

Muddy Movie: ఇండియాలో మొదటిసారిగా మడ్ రేస్ నేపధ్యంలో రాబోతున్న చిత్రం “మడ్డీ”. యువన్, రిధాన్ కృష్ణ, అనూష సురేష్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 10న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ మరియు ఇంగ్లీషుతో సహా 6 భాషల్లో విడుదలకి సిద్దం అవుతోంది. కాగా ఈ చిత్రానికి దర్శకుడు డా. ప్రగాభల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, పికే 7 బ్యానర్‌పై ప్రేమ కృష్ణదాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 28, 2021 / 07:18 PM IST
    Follow us on

    Muddy Movie: ఇండియాలో మొదటిసారిగా మడ్ రేస్ నేపధ్యంలో రాబోతున్న చిత్రం “మడ్డీ”. యువన్, రిధాన్ కృష్ణ, అనూష సురేష్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 10న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ మరియు ఇంగ్లీషుతో సహా 6 భాషల్లో విడుదలకి సిద్దం అవుతోంది. కాగా ఈ చిత్రానికి దర్శకుడు డా. ప్రగాభల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, పికే 7 బ్యానర్‌పై ప్రేమ కృష్ణదాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి కేజీఎఫ్ ఫేం రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

    ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లకు ప్రేక్షకులు, అభిమానుల నుండి విశేష స్పందన లభించింది. ఈ చిత్రానికి కేజీఎఫ్ ఫేం రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లకు ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభించింది.

    అయితే తాజాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమా తెలుగు హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. దీంతో మడ్డీ చిత్రంకి తెలుగులో కూడా పెద్ద మద్దతు లభించింది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇంటెన్స్ పోస్టర్ ద్వారా మేకర్స్ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను నవంబర్ 30 సాయంత్రం 4:30 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా విడుదల అయిన పోస్టర్ తో సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.