Skylab Movie: ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య, తిమ్మరసు వంటి సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యదేవ్. వరుస ప్రయోగాలను చేసి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు ఈ యంగ్ హీరో. తాజాగా సత్యదేవ్, నిత్యామేనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా స్కైలాబ్. విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంను డాక్టర్ కే రవి కిరణ్ సమర్పణలో బైట్ ఫీచర్స్, నిత్యామీనన్ కలిసి నిర్మిస్తున్నారు. కాగా ఈ మూవీకి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, విడియోలు విడుదలై ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ లకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తుంది.

తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన సరికొత్త పోస్టర్ ను చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఈ చిత్రానికి క్లీన్ యూ సర్టిఫికెట్ రావడం విశేషం అని చెప్పాలి. డిసెంబర్ 4 వ తేదీన విడుదల అవుతున్న ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందుకు సంబంధించిన ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ వేగవంతం చేయడం జరిగింది. ఈ మూవీ ప్రి రిలీజ్ వేడుకకి నేచురల్ స్టార్ నాని స్పెషల్ గెస్ట్ గా రానున్నారు.
1979 సంవత్సరంలో మన తెలుగు రాష్ట్రంలో బండ లింగపల్లి అనే గ్రామంలో కొన్ని విచిత్రమైన పరిస్థితులు జరిగాయి. అమెరికా స్పేస్ స్టేషన్ నాసా ప్రయోగించిన స్పేస్ స్టేషన్ స్కైలాబ్ భూమిపై పడుతుందని, భూమి నాశనమైపోతుందని వార్తలు వచ్చాయి. ఆ సమయంలో ప్రపంచమంతా అసలేం జరగబోతుందోనని ఊపిరి బిగపట్టి ఎదురు చూడసాగారు. వార్తాపత్రికలు ఈ వార్తను ప్రముఖంగా కవర్ చేశాయి. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో ఉండే గౌరి, ఆనంద్, రామారావుల జీవితాల్లో స్కైలాబ్ వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే విషయాలను ఎంటర్‌టైనింగ్‌గా చెప్పే ప్రయత్నమే ఈ చిత్రం.