Miss Shetty Mr Polishetty: అనుష్క శెట్టి సెలెక్టెడ్ గా చిత్రాలు చేస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత ఒక రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ కి సైన్ చేశారు. నవీన్ శెట్టి పోలిశెట్టి హీరోగా నటిస్తున్నాడు. డిఫరెంట్ లవ్ స్టోరీతో దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ హోమ్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ లో నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ నేడు విడుదల చేశారు. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ అనే డిఫరెంట్ క్యాచీ టైటిల్ ఫిక్స్ చేశారు. హీరో హీరోయిన్ పేర్లలోని తోకలను టైటిల్ గా సెట్ చేయడం కొత్తగా అనిపించింది.

ఇక ఫస్ట్ లుక్ పోస్టర్లో చాలా డీటెయిల్స్ ఇచ్చారు. అనుష్క శెట్టి చేతిలో ‘హ్యాపీ సింగిల్’ అనే బుక్ ఉంది. కాబట్టి ఆమె సింగిల్ లైఫ్ కోరుకునే అమ్మాయి కావచ్చు. ప్రేమ, రిలేషన్, మ్యారేజ్ అంటే పడని ఇంట్రావర్ట్ క్యారెక్టర్ కావచ్చు. దానికి పూర్తి భిన్నం హీరో క్యారెక్టర్. నవీన్ పోలిశెట్టి టీ షర్ట్ పై ‘రెడీ టు మింగిల్’ అనే లైన్ ఉంది. లైఫ్ లో లవ్, లవర్ లేని సింగిల్ లైఫ్ తో విసిగిపోయి… తోడు కోరుకుంటున్న కుర్రాడిగా కనిపించే సూచనలు కలవు.
ఇక పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ గమనిస్తే… హీరోయిన్ విదేశాల్లో ఉన్నట్లు, హీరో హైదరాబాద్ లో ఉన్నట్లు చెప్పారు. డిఫరెంట్ ఏజ్ గ్రూప్ లవ్ స్టోరీగా కూడా ఈ సినిమా ఉండనుందని సమాచారం. మొత్తంగా రెండు డిఫరెంట్ మెంటాలిటీలు కలిగిన వ్యక్తుల మధ్య జరిగే రొమాంటిక్ డ్రామానే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ అని… ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా అర్థం అవుతుంది. ఏది ఏమైనా దర్శకుడు ఫస్ట్ లుక్, టైటిల్ విషయంలో ప్రత్యేకత చాటుకున్నాడు. సినిమాపై అంచనాలు పెంచేశాడు.
ఈ చిత్రం 2023 సమ్మర్ కానుకగా విడుదల కానుంది. జాతిరత్నాలు చిత్రం తర్వాత నవీన్ పోలిశెట్టి నుండి వస్తున్న చిత్రం ఇది. చిన్న చిత్రంగా విడుదలైన జాతిరత్నాలు మంచి విజయం సాధించింది. ఇక అనుష్క బాహుబలి సిరీస్ అనంతరం సినిమాలు తగ్గించేశారు. ఈ మధ్య కాలంలో అనుష్క నటించిన భాగమతి, నిశ్శబ్దం మాత్రమే పూర్తి స్థాయి చిత్రాలు. అవి రెండూ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు. చాలా కాలం తర్వాత అనుష్క శెట్టిని ఒక రొమాంటిక్ రోల్ లో ప్రేక్షకులు చూడబోతున్నారు.