https://oktelugu.com/

డబ్బుల కోసం బూతు సినిమా తీసిన ‘పెద్ద మనిషి’ !

కాలం కలిసిరాక పోతే.. ఎంత గొప్పోళ్ళు అయినా అట్టడుగు స్థాయికి పడిపోక తప్పదు. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎం.ఎస్.రాజు అంటే.. ఓ జూనియర్ రామానాయుడు. నిజానికి, అప్పుడు రామానాయుడికి కూడా అంత క్రేజ్ లేదు. ఎంఎస్ రాజుకు ఆ రేంజ్ గుర్తింపు, గౌరవం దక్కాయి. ఒకవిధంగా రాజుగారికి హీరోలకి సమానంగా క్రేజ్ ఉండేది. దానికి కారణం.. రాజుగారి సినిమాల సెలెక్షనే కారణం. నిర్మాతగా ఆయన అందించిన బ్లాక్ బస్టర్స్ ఇప్పటికీ గొప్ప సినిమాలుగానే నిలిచాయి అవి. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 9, 2020 / 05:46 PM IST
    Follow us on


    కాలం కలిసిరాక పోతే.. ఎంత గొప్పోళ్ళు అయినా అట్టడుగు స్థాయికి పడిపోక తప్పదు. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎం.ఎస్.రాజు అంటే.. ఓ జూనియర్ రామానాయుడు. నిజానికి, అప్పుడు రామానాయుడికి కూడా అంత క్రేజ్ లేదు. ఎంఎస్ రాజుకు ఆ రేంజ్ గుర్తింపు, గౌరవం దక్కాయి. ఒకవిధంగా రాజుగారికి హీరోలకి సమానంగా క్రేజ్ ఉండేది. దానికి కారణం.. రాజుగారి సినిమాల సెలెక్షనే కారణం. నిర్మాతగా ఆయన అందించిన బ్లాక్ బస్టర్స్ ఇప్పటికీ గొప్ప సినిమాలుగానే నిలిచాయి అవి.

    Also Read: ‘ఆర్‌ఆర్‌ఆర్’లో టాలెంటెడ్ కమెడియన్ కూడా కీలకమేనట !

    వాటిల్లో ముఖ్యంగా శతృవు, దేవి, ఒక్కడు, మనసంతా నువ్వే, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా… ఇలా ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ రాజుగారి ఖాతాలో ఉన్నాయి కాబట్టే.. ఆయనకు అప్పట్లో అంత క్రేజ్ ఉంది. ఇప్పుడు కూడా సినీ సర్కిల్స్ లో అంత గౌరవం ఉంది. కాకపోతే, నిర్మాతగా క్రేజ్ కోల్పోయాక రాజుగారు డైరెక్టర్ గా కొత్త అవతారం ఎత్తారు. మరి, ఈ సీనియర్ నిర్మాత తన క్రేజ్ కోల్పోయాక.. ఇంకా చాలా పోగుట్టుకున్నాకా… ఇప్పుడు డైరెక్టర్ గా మారి ఏమి సాధిస్తారు అని కామెంట్స్ కూడా వినిపించాయి. ఈ కామెంట్స్ ఆయనకు తెలియనివి కావు.

    అందుకే ఆయన చాల స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. తానూ డైరెక్టర్ అయింది.. కేవలం డబ్బులు కోసం అని.. ఆయన చాల స్పష్టంగా చెబుతున్నారు. తన పాత పేరును పక్కన పెట్టి, సక్సెస్ కోసం బోల్డ్ ప్రాధాన్య సినిమా తీశానని ఆయనే తన సన్నిహితుల దగ్గర ఓపెన్ అయ్యారట. ఇంతకీ రాజుగారి తీసిన సినిమా పేరు ‘డర్టీ హారి’. పేరులోనే డర్టీ ఉంది కాబట్టి.. కథలో కూడా ఓ రేంజ్ మసాలాను దట్టించి.. జనం మీదకు వదలడానికి సినిమాను రెడీ చేస్తున్నారు.

    Also Read: ఇంగ్లీష్ సినిమాని కాపీ చేస్తోన్న సీనియర్ హీరో !

    కాగా తాజాగా ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన ట్రైలర్ లో కొంత తక్కువ మసాలా డోస్ వేసినా.. సినిమాలో మాత్రం మసాలా సరుకు ఎక్కువే ఉందని.. రాజుగారికి దండీగా డబ్బు రావడం ఖాయం అని తెలుస్తోంది. మొత్తానికి డబ్బు కోసం ఈ పెద్ద సినిమా బూతు సినిమా తీశాడు అన్నమాట.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్