https://oktelugu.com/

నమ్రతా పోస్ట్ కు ఫీల్ అయిన రాజు !

సూపర్ ‌స్టార్‌ మహేష్‌ బాబు నటించిన ‘ఒక్కడు’ సినిమా విడుదలై 18 ఏళ్లు పూర్తి చేసుకుంది. ప్రిన్స్ గా ఉన్న మహేష్ ను సూపర్ స్టార్ ను చేసిన సినిమా ఇది. క్లాస్ అభిమానులు ఉన్న మహేష్ కి మాస్ లో ఫుల్ ఫాలోయింగ్ పెరగడానికి కారణమైన తొలి సినిమా కూడా ఇదే. 2003లో విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ కమర్షియల్ క్లాసిక్ గా నిలిచింది. ఇక 18 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మహేష్‌ భార్య […]

Written By:
  • admin
  • , Updated On : January 16, 2021 / 12:56 PM IST
    Follow us on


    సూపర్ ‌స్టార్‌ మహేష్‌ బాబు నటించిన ‘ఒక్కడు’ సినిమా విడుదలై 18 ఏళ్లు పూర్తి చేసుకుంది. ప్రిన్స్ గా ఉన్న మహేష్ ను సూపర్ స్టార్ ను చేసిన సినిమా ఇది. క్లాస్ అభిమానులు ఉన్న మహేష్ కి మాస్ లో ఫుల్ ఫాలోయింగ్ పెరగడానికి కారణమైన తొలి సినిమా కూడా ఇదే. 2003లో విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ కమర్షియల్ క్లాసిక్ గా నిలిచింది. ఇక 18 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మహేష్‌ భార్య నమ్రతా శిరోద్కర్‌ ఒక్కడు సినిమాను గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టు పెట్టింది.

    Also Read: అయ్యొయ్యో.. మరీ ఇంత ఘోరం ఏమిటయ్యా ?

    ఆమె పోస్ట్ పెడుతూ ‘మహేష్‌ సినిమాల్లో ఒక్కడు క్లాసిట్‌ హిట్‌. మళ్లీ మళ్లీ చూడలనించే సినిమా.. ఒక్కడు నాకు ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ అని తెలిపింది. అయితే, ఈ పోస్టు ప్రస్తుతం చర్చకు దారి తీసింది. పోస్టులో.. చిత్రయూనిట్‌ సభ్యులైన మహేష్, భూమిక, గుణశేఖర్, ప్రకాష్ రాజ్, ఫైట్ మాస్టర్ విజయన్, మణిశర్మ ఇలా అందరి పేర్లను ప్రస్తావించిన నమ్రత, ఆ సినిమాకి మెయిన్ పర్సన్ అయిన నిర్మాత ఎమ్‌ఎస్‌ రాజును మాత్రం మర్చిపోయింది. దాంతో రాజుగారు బాగానే హర్ట్ అయినట్టు ఉన్నారు.

    Also Read: వకీల్ సాబ్ కాదు, కిచిడీ సాబ్ !

    పైగా ఎమ్‌ఎస్‌‌ రాజు, నమ్రత ట్వీట్‌ పై స్పందిస్తూ.. ‘పొరపాట్లు జరుగుతుంటాయి బాబు. నమ్రతగారు ఒక్కడు గురించి మాట్లాడుతూ నా పేరును మర్చిపోయారు. అయినా నాకు సంతోషమే. ఈ సినిమా ఆమెకు ఫెవరెట్‌ మూవీ అయినందుకు. గుడ్‌లక్‌’ అంటూ రాజుగారు ట్వీట్‌ చేశారు. పైగా మహేష్‌ ను ట్యాగ్‌ చేశారు. మరి ఎమ్ఎస్‌ రాజు ట్వీట్‌ కు మహేష్‌ ఎలా స్పందిస్తాడో చూడాలి. ఏది ఏమైనా ఒక్కడు సినిమా గురించి పేర్కొనే సమయంలో నమ్రత తన పేరును ప్రస్తావించలేదని ఎమ్‌ఎస్‌ రాజు బాగా హర్ట్‌ అయ్యారు. ఆయనకు దక్కాల్సిన గౌరవం దక్కలేదనే ఆయన బాధ.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్