MS-Dhoni-and-Janhvi-Kapoor
MS Dhoni: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ముఖేష్–నీతా అంబానీల చిన్న కొడుకు అనంత్ అంబానీ–రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మూడు రోజులపాటు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. రాధిక ప్రముఖ పారిశ్రామికవేత్త వీరేన్ మచ్చంట్, శైల మర్చంట్‌ల కూతురు. ఈ ఏడాది జూలై 12న వీరి పెళ్లి జరుగనుంది. పెళ్లి వేడుకల్లో భాగంగా మార్చి 1 నుంచి మార్చి 3 వరకు ప్రీ వెడ్డింగ్ వేడుకలు నిర్వహించారు.
అతిరథ మహారధుల రాక..
తమ సొంత రాష్ట్రం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో నిర్వహించిన ఈ వేడుకలకు రూ.1000 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మొదటి రోజు 50 వేల మందికి అన్నదానంతో వేడుకలు ప్రారంభించారు. రెండు, మూడో రోజు దేశంతోపాటు ప్రపంచ నలుమూలల నుంచి అతిథులు హాజరయ్యారు. వీవీఐపీలు, వీఐపీల రాకతో గుజరాత్‌తోని జామ్‌నగర్ విమానాశ్రయం, అంతర్జాతీయ విమానాశ్రయంలా మారింది.
బాలీవుడ్ స్టార్స్.. క్రీడాకారులు..
ఇక ఈ వేడుకలకు బాలీవుడ్ స్టార్స్ షారుక్ ఖాన్, సల్మాన్‌ఖాన్, అమీర్‌ఖాన్, అలియాభట్, రణబీర్‌కమూర్, జాన్వీకపూర్‌తోపాటు పలువురు బాలీవుడ్ తారలు హాజరయ్యారు. వేదికపై ప్రదర్శన ఇచ్చారు. ఇక భారత క్రికెట్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకకు హాజరయ్యేందుకు వచ్చాడు. సాధారణంగా పబ్లిక్ ఫంక్షన్లలో అరుదుగా కనిపించే మహి తన భార్య సాక్షి, కూతురు జీవాతో కలిసి వచ్చారు.
ప్రత్యేక ఆకర్షణగా మహీ కపుల్స్..
ఇక అనంత్–రాధిక ప్రీవెడ్డింగ్ వేడుకలో మహేంద్రసింగ్‌ధోని–సాక్షి కపుల్ కలర్‌ఫుల్‌గా కనిపించారు. సాక్షితో హీరోయిన్ జాన్వీ ఒక మెమొరబుల్ ఫొటో దిగింది. దీనిని తన సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Ms dhoni at anant ambanis pre wedding function
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com