Mrunal Thakur-Dhanush Dating: ప్రేమ విషయం లో గత కొద్దిరోజుల నుండి ప్రముఖ హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) పై ఎన్నో ప్రత్యేకమైన కథనాలు రావడం మనమంతా చూస్తూనే ఉన్నాం. ముందుగా ఈమె ప్రముఖ హీరో సుమంత్ తో డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వినిపించాయి. కానీ అవన్నీ కేవలం పుకార్లే అని సుమంత్ క్లారిటీ ఇవ్వడం తో ఆ వార్తలకు చెక్ పడింది. ఇక ఆ తర్వాత ఈమె ప్రముఖ కోలీవుడ్ హీరో ధనుష్ తో ప్రేమాయణం నడుపుతుందని, త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై అటు ధనుష్(Dhanush) నుండి కానీ, మృణాల్ ఠాకూర్ నుండి కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. అసలు ఈ రూమర్స్ వార్తలు ఎక్కడి నుండి వచ్చాయంటే, ధనుష్ మృణాల్ ఠాకూర్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం, అదే విధంగా మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ చిత్రం ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా రావడం వంటివి వీళ్లిద్దరి ఎదో నడుస్తుంది అనే రూమర్స్ కి నాంది పలికింది.
ధనుష్ తన భార్య ఐశ్వర్య తో విడిపోయి చాలా కాలం అయ్యింది. ఆమెతో విడిపోయిన కొన్నాళ్ళకు ఆయన మృణాల్ ఠాకూర్ కి కనెక్ట్ అయ్యాడని, వీళ్లిద్దరు ఇప్పటి వరకు ముంబై లో ఎన్నో ప్రైవేట్ పార్టీలలో కూడా హల్చల్ చేసారని చెప్పుకొచ్చారు అక్కడి లోకల్స్. ఇకపోతే రీసెంట్ గా ధనుష్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో అప్లోడ్ చేసిన ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన తన బ్యాక్ వ్యూ ఫోటో ని అప్లోడ్ చేస్తూ ‘అనుకోని కొన్ని సంఘటనలు అద్భుతాన్ని సృష్టిస్తాయి’ అనే క్యాప్షన్ తో ఒక పోస్టు పెట్టాడు. ఈ పోస్ట్ పెట్టిన నిమిషాల వ్యవధిలోనే మృణాల్ ఠాకూర్ లైక్ కొట్టడం హాట్ టాపిక్ గా మారిన అంశం. ఆ ఫోటో తీసింది మృణాల్ ఠాకూర్ నే అని, ఆ పోస్టుని ధనుష్ ఆమె సమక్షంలోనే పబ్లిష్ చేసాడని, ఇలా రకరకాల కథనాలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.
సినీ సెలబ్రిటీలు ఒకరివి ఒకరు లైక్ కొట్టుకోవడం, కామెంట్స్ పెట్టడం కొత్తేమి కాదు కదా, అలాంటప్పుడు మృణాల్ ఠాకూర్ ఎందుకు ఆ పోస్ట్ కి లైక్ కొట్టినప్పుడు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అంటూ కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక అబ్బాయి, అమ్మాయి స్నేహంగా ఉన్నంత మాత్రానా వాళ్ళ మధ్య ఎదో నడుస్తుందని ఊహించుకోవడం కరెక్ట్ కాదని, ఈ కాలం లో కూడా ఇలాంటివి ఏంటి అంటూ ధనుష్ ఫ్యాన్స్ అంటున్నారు. అయితే నిప్పు లేనిదే పొగరాదు, తమపై ఇన్ని రూమర్స్ వస్తున్నా కనీసం రెస్పాన్స్ ఇవ్వడం లేదంటే వీళ్ళ మధ్య కచ్చితంగా ఎదో నడుస్తుంది అనేది వాస్తవమని అంటున్నారు. మరి వీటిల్లో ఏది నిజమో రాబోయే రోజుల్లో చూడాలి.