‘Mrityunjay’ Movie Teaser : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు ఉన్నప్పటికి యంగ్ హీరోలకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఇక డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్న వాళ్లలో శ్రీ విష్ణు (Sri Vishnu) మొదటి స్థానంలో ఉన్నాడు. సినిమా, సినిమాకి సంబంధం లేకుండా డిఫరెంట్ జానర్లలో సినిమాలు చేయడమే కాకుండా యావత్ తెలుగు ప్రేక్షకులందరిని మెప్పిస్తూ ముందుకు సాగుతున్నాడు. మరి ఇలాంటి శ్రీ విష్ణు ప్రస్తుతం ‘మృత్యుంజయ్’ (Mrithyumjay) అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ‘హుస్సేన్ షా కిరణ్’ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు. అయితే టీజర్ లో పెద్దగా సినిమాకు సంబంధించిన స్టోరీ ఏది రివిల్ చేయకపోయిన కూడా శ్రీ విష్ణు క్యారెక్టరైజేషన్ మాత్రం తెలియజేశారు. ‘ నేను అయిపోయింది అనుకునే అంతవరకు అవ్వదు’ అనే డైలాగుతో తన క్యారెక్టర్ ఎంత పవర్ ఫుల్ గా ఉండబోతుందో తెలియజేశారు.
ముఖ్యంగా సినిమా మొత్తానికి తన క్యారెక్టర్ హైలెట్ గా నిలువబోతోంది అనేది మరోసారి ఈ టీజర్ ద్వారా తెలియజేశారు. ఇక విజువల్స్ విషయానికి వస్తే చాలా రిచ్ గా తెరకెక్కించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఒక మర్డర్ మిస్టరీ మీద రన్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. టీజర్ లో ఒక ఫైర్ షాట్ కూడా ఎలివేట్ చేశారు. అంటే ఆయన క్యారెక్టర్ ఫైర్ లాఎప్పుడు అగ్రేసివ్ గా ఉండబోతున్నట్టుగా సింబాలిక్ గా తెలియజేశారు.
అలాగే పోలీస్ ఆఫీసర్ ఒక ఇన్వెస్టిగేషన్ ను కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక శ్రీ విష్ణు జైల్లో ఉండి ఏదో ఒక సీరియస్ మర్డర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ‘సామజవరగమన ‘ సినిమా తర్వాత శ్రీ విష్ణు కి పెద్దగా సక్సెసులైతే రావడం లేదు. కాబట్టి ఇప్పుడు వస్తున్న ఈ సినిమాతో మరోసారి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందుకొని మరికొన్ని డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
మరి ఈ సినిమాలో శ్రీ విష్ణు డిఫరెంట్ యాక్టింగ్ ను ట్రై చేసినట్టుగా కూడా తెలుస్తోంది. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ సక్సెస్ ను సాధిస్తారా లేదా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…
Also Read : రాజాసాబ్ సినిమా రిలీజ్ డేట్ కి రావడం కష్టమేనా..?