Mrunal Thakur: ‘ఈమధ్య కాలంలో సోషల్ మీడియా లో మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) పేరు ఎక్కువగా ట్రెండ్ అవుతూ వస్తోంది. పాన్ ఇండియా లెవెల్ లో ఆమె పాపులర్ హీరోయిన్ కాబట్టి, ఆమె పేరు నిత్యం ట్రెండింగ్ లోనే ఉంటుంది, అందులో ఎలాంటి వింత లేదు. కానీ తమిళ హీరో ధనుష్(Dhanush K Raja) తో ఆమె ప్రేమాయణం నడుపుతున్నట్టు వార్తలు రావడం, త్వరలోనే ఈ జంట పెళ్లి కూడా చేసుకోబోతుందని ప్రచారం జరగడం, ఈ ప్రచారం పై అటు మృణాల్ ఠాకూర్ కానీ, ఇటు ధనుష్ కానీ ఎలాంటి బలమైన రియాక్షన్ ఇవ్వకపోవడం తో, ఇవి రూమర్స్ కాదు, నిజమే అని అందరూ నమ్మే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యం లో రీసెంట్ గా మృణాల్ ఠాకూర్ ఒక ఇంటర్వ్యూ లో బ్రేకప్ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
ఆమె మాట్లాడుతూ ‘నా ప్రేమ విషయానికి వస్తే, సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టకముందు వరకూ చాలా అద్భుతంగా ఉండేది. కానీ ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత అంతా మారిపోయింది. నువ్వు చాలా హడావడిగా ఉంటావని నా బాయ్ ఫ్రెండ్ అనేవాడు. నీలోని ఆ లక్షణాన్ని నేను హ్యాండిల్ చెయ్యలేను అనేవాడు. అంతే కాకుండా నేను హీరోయిన్ అవ్వడం అసలు అతనికి ఇష్టం లేదు. అందుకే బ్రేకప్ చెప్పి విడిపోయాను. మొదట్లో చాలా బాధ వేసింది. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. కానీ ఆ రిలేషన్ అలా బ్రేక్ అవ్వడం నా భవిష్యత్తుకి చాలా ఉపయోగపడింది. లేదంటే చాలా ఇబ్బందులను ఎదురుకోవాల్సి వచ్చేది’ అంటూ చెప్పుకొచ్చింది మృణాల్ ఠాకూర్. ఆమె హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ చిత్రం ‘దో దీవానే సహర్ మేన్’ అనే చిత్రం ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చేసిన వ్యాఖ్యలివి.
టీవీ సీరియల్స్ ద్వారా కెరీర్ ని మొదలు పెట్టిన మృణాల్ ఠాకూర్, ఆ తర్వాత బాలీవుడ్ లో అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. తెలుగు లో ఈమె ‘సీతా రామం’ అనే సూపర్ హిట్ చిత్రం ద్వారా మన ముందుకొచ్చింది. ఆ తర్వాత ఈమె నాని తో చేసిన ‘హాయ్ నాన్న’ కూడా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. ఈ రెండు సినిమాల తర్వాత ఆమె విజయ్ దేవరకొండ తో కలిసి చేసిన ‘ది ఫ్యామిలీ స్టార్’ మాత్రం కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది. ఇక ఆ తర్వాత పెద్దగా తెలుగు సినిమాల్లో కనిపించని మృణాల్ ఠాకూర్, మార్చి 19 న అడవి శేష్ హీరో గా నటించిన డెకాయిట్ చిత్రం తో మన ముందుకు రాబోతుంది.