Mr Pregnant Twitter Talk: కెరీర్ బిగినింగ్ లో సయ్యద్ సోహైల్ చిన్న చిన్న సపోర్టింగ్ రోల్స్ చేశాడు. బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న సోహైల్ పాపులారిటీ రాబట్టాడు. ప్రస్తుతం హీరోగా చిత్రాలు చేస్తున్నాడు. ఆయన లేటెస్ట్ మూవీ మిస్టర్ ప్రెగ్నెంట్. ఓ భిన్నమైన సబ్జెక్టు తో దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి తెరకెక్కించాడు. ప్రీమియర్స్ ఇప్పటికే ముగియగా టాక్ బయటకు వచ్చింది. సినిమా చూసిన ఆడియన్స్ ఏమంటున్నారో చూద్దాం.
మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ కథ విషయానికి వస్తే… వివాహం చేసుకున్న సోహైల్ తన బిడ్డను తానె మోయాలి అనుకుంటాడు. అందుకోసం అతడే గర్భం దాల్చుతాడు. తల్లితనం అనుభవించాలని కోరుకున్న ఓ తండ్రిని సమాజం ఎలా చూసింది. శాస్త్రానికి, సాంప్రదాయాన్ని విరుద్ధమైన పని చేసిన సోహైల్ కుటుంబం నుండి, సమాజం నుండి ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నాడు అనేదే మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ కథ.
నెటిజెన్స్ మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక భిన్నమైన కథను ఎంచుకోవడం ప్రశంసించాల్సిన విషయం అంటున్నారు. అబ్బాయి గర్భం దాల్చడం అనే విషయాన్ని ప్రేక్షకులు ఒప్పుకునేలా తెరకెక్కించడంలో దర్శకుడు శ్రీనివాస్ సక్సెస్ అయ్యాడని అంటున్నారు. కామెడీ, రొమాన్స్, హ్యూమర్, ఎమోషనల్ కలగలిపి చక్కగా తెరకెక్కించారని నెటిజెన్స్ అభిప్రాయం.
ఇక సోహైల్ తన పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు. ఛాలెంజింగ్ రోల్ లో జీవించే ప్రయత్నం చేశాడు. ఇక హీరోయిన్ రూప కోడువయూర్ గ్లామర్ తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లో అలరించింది. నటుడు బ్రహ్మాజీ కామెడీ ట్రాక్ బాగా పేలింది అంటున్నారు. మొత్తంగా చెప్పాలంటే మిస్టర్ ప్రెగ్నెంట్ ఓ డీసెంట్ మూవీ. కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు.
అప్పిరెడ్డి ఈ చిత్ర నిర్మాతగా ఉన్నారు. సుహాసిని, అలీ, హర్ష, రాజా రవీంద్ర ఇతర కీలక రోల్స్ చేశారు. శర్వన్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఆగస్టు 18న మిస్టర్ ప్రెగ్నెంట్ విడుదలైంది. ఇక ట్విట్టర్ ఆడియన్స్ అభిప్రాయం పాజిటివ్ గా ఉంది. సోహైల్ కి హీరోగా మొదటి హిట్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. సోహైల్ ఈ చిత్రం కోసం గట్టిగా ప్రమోషన్స్ చేయడం విశేషం.
#MrPregnant is decent movie with Emotional content. @RyanSohel superb performance and lived in the Character@RoopaKoduvayur looks good with glamour and Acting#suhasini in a dignified role@SVinjanampati good attempt with very critical point@actorbrahmaji Comedy track is… pic.twitter.com/4Ko40iSSd8
— Rajababu Anumula (@Rajababu_a) August 17, 2023
#MrPregnant ప్రశంసనీయ ప్రయత్నం. మంచి ఎమోషనల్ జర్నీ. అన్ని పాళ్లు మేళవింపుతో తెరకెక్కించాడు దర్శకుడు శ్రీనివాస్. కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చేసిన నిర్మాత @Appireddya కి అభినందనలు. @RyanSohel సోహైల్ వన్ మ్యాన్ షో. రూపా బాగా చేసింది. ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన మూవీ. pic.twitter.com/mnf4P6zP3I
— Aithagoni Raju off (@AithagoniRaju) August 17, 2023
#MrPregnant @RyanSohel
Just watched the premiere of Mr. PREGNANT. Its a worth watch movie especially for family audiences who connects so well with the emotional ride which drive throughout. The concept is unique and people will stick to their seats to watch it. pic.twitter.com/gftH4P58ps— Mr.Mahesh (@stylishmahesh) August 17, 2023