Samantha: సమంత-నాగ చైతన్య ప్రేమ వివాహం చేసుకున్నారు. 2018లో గోవా వేదికగా హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతుల్లో వారి వివాహం జరిగింది. నాలుగేళ్ళ వైవాహిక బంధం అనంతరం మనస్పర్థలు తలెత్తాయి. 2021లో అక్టోబర్ లో అధికారికంగా విడాకులు ప్రకటించారు. ఈ విషయంలో సమంత కొంత వ్యతిరేకత ఎదుర్కొన్నారు. ఆమెపై పలు ఆరోపణలు వినిపించాయి. సమంత తనపై వచ్చిన నిరాధార ఆరోపణలు ఖండించారు. ఆమె కొన్ని ఛానల్స్ మీద లీగల్ యాక్షన్ తీసుకోవడం విశేషం.
విడాకులు సమంతను మానసిక వేదనకు గురి చేశాయి. అదే సమయంలో ఆమె నాగ చైతన్య అంటే మండిపడుతున్నారు. ఈ విషయాన్ని ఆమె ఒకటి రెండు సందర్భాల్లో వ్యక్తపరిచింది. నేరుగా, పరోక్షంగా నాగ చైతన్య మీద సమంత ఆరోపణలు చేయడం విశేషం. ఇక నాగ చైతన్య విడిపోయి రెండేళ్లు అవుతుంది. అయినా సమంతకు విడాకులు తాలూకు బాధ, నాగ చైతన్య మీద కోపం పోలేదనిపిస్తుంది.
ఇటీవల ఖుషి మూవీ ఆడియో రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వేదికపై ఓ సింగర్ మజిలీ సినిమాలోని ‘ప్రియతమా ప్రియతమా’ సాంగ్ పాడింది. హీరో అంటే హీరోయిన్ కి ఎంత ఇష్టమో చెప్పే సందర్భంలో ఈ సాంగ్ వస్తుంది. ఈ సాంగ్ పాడేటప్పుడు సమంత ముఖం మారిపోయింది. ఆమె ఇబ్బందిగా ఫీలయ్యారని స్ఫష్టంగా తెలిసింది. నాగ చైతన్యను గుర్తు చేసిన ఆ పాట పాడటం ఆమె ఇష్టపడ్డట్లు లేదు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. మజిలీ మూవీలో సమంత-నాగ చైతన్య జంటగా నటించారు. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకుడు. ఖుషి చిత్ర దర్శకుడు కూడా శివ నిర్వాణనే. అందుకే ఈ సాంగ్ పాడటం జరిగింది. సమంత మాత్రం ఇబ్బందిగా ఫీలైంది. ఇక విజయ్ దేవరకొండకు జంటగా నటించిన ఖుషి చిత్రం సెప్టెంబర్ 1న విడుదల కానుంది.
https://twitter.com/Sravanthi_Sam/status/1691801560609681677?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1691801560609681677%7Ctwgr%5E4c32edebeb133a4efeb39023c2dcf6855aaed70f%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Fsamantha-gets-emotional-while-listening-majili-song-1738842