Homeఆంధ్రప్రదేశ్‌Eruvaaka Foundation Kisan Mahotsav : వడ్డేశ్వరం కేఎల్ వర్సిటీలో ‘ఏరువాక ఫౌండేషన్‘ కిసాన్ మహోత్సవం

Eruvaaka Foundation Kisan Mahotsav : వడ్డేశ్వరం కేఎల్ వర్సిటీలో ‘ఏరువాక ఫౌండేషన్‘ కిసాన్ మహోత్సవం

వ్యవసాయ వార్షిక అవార్డులు – 2022, ఆంధ్రప్రదేశ్

Eruvaaka Foundation Kisan Mahotsav : వ్యవసాయ రంగంలో కృషిని గుర్తించి, తదుపరి ప్రయత్నాలను ప్రేరేపించడానికి, ఏరువాక ఫౌండేషన్ వివిధ విభాగాలలో ప్రతిష్టాత్మకమైన ఏరువాక వ్యవసాయ వార్షిక అవార్డులను ఏర్పాటు చేసింది. ప్రతి సంవత్సరం ఇరు తెలుగు రాష్ట్రాలలో వ్యవసాయాభివృద్ధికి కృషి చేస్తున్న వ్యవసాయ కళాశాలలు మరియు వాటి అనుబంధ విభాగాలలో, వ్యవసాయ కంపెనీలు, కెవికెలలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు, విద్యార్థులు, పాత్రికేయులు, అగ్రి యాప్స్, సామాజిక మాధ్యమాల నిర్వాహకులు మరియు సృజనాత్మక రైతుల యొక్క విశిష్టమైన సేవలను ఏరువాక ఫౌండేషన్ గుర్తించి ఈ అవార్డులను అందిస్తుంది. “ఏరువాక ఫౌండేషన్” రైతు సాధికారత కోసం వ్యవసాయ తెలుగు మాసపత్రికైన “ఏరువాక” ద్వారా ఇరు తెలుగు రాష్ట్రాల్లోని వ్యవసాయ సమాజానికి, అనుబంధ రంగాలకు తన వంతు సహకారం అందిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో అవార్డుల ప్రధానోత్సవానికి మరికొద్ది రోజుల్లో మీ ముందుకు రావటానికి సిద్ధం అవుతున్నామని తెలియజేసేందుకు సంతోషిస్తున్నాము. 2023 ఆగస్టు 19వ తేదీ శనివారం ఉదయం 09:00 గం.ల నుండి సాయంత్రం 05:00 గం.ల వరకు ఆంధ్రప్రదేశ్ లోని వడ్డేశ్వరం లోని R&D థియేటర్, KL యూనివర్సిటీ ప్రాంగణంలో ‘ఏరువాక ఫౌండేషన్’ నిర్వహణలో ఈ కార్యక్రమం జరగనుంది.

అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా రైతులకు ఎంతగానో ఉపయోగపడే మిద్దె తోటల పెంపకం నిర్వహణ – సొంత ఆహారాన్నిపెంచుకోవడం, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు తెలివైన వ్యవసాయ సంస్థలుగా మారవలసిన ఆవశ్యకత, సేంద్రియ మరియు ప్రకృతి వ్యవసాయం అనుసంధానం – సమర్థవంతైన అమ్మకాల వ్యూహాలు, ఆధునిక వ్యవసాయంలో అధునాతన పద్ధతులు – మార్పులు తదితర అంశాలపై ప్రసంగాలు మరియు చర్చా గోష్ఠి ఉంటాయి. ఈ కార్యక్రమంలో రైతులు, ఉత్పత్తిదారుల సంఘాలు, విద్యార్థులు అవకాశాన్ని వినియోగించుకుంటారని ఏరువాక ఫౌండేషన్ భావిస్తుంది.

ఈ సందర్భంగా అవార్డులకు ఎంపికైన విజేతలకు ఏరువాక ఫౌండేషన్ శుభాకాంక్షలు తెలియచేసుకుంటుంది. కిసాన్ మహోత్సవం – 2023 మరియు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి రైతులు, ఉత్పత్తిదారుల సంఘాలు, విద్యార్థులు, తదితరులు తప్పనిసరిగా హాజరయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏరువాక ఫౌండేషన్ కోరుకుంటుంది.

ఏరువాక ఫౌండేషన్ వ్యవసాయ వార్షిక అవార్డులు – 2022, ఆంధ్రప్రదేశ్- విజేతల జాబితా:
1. ఉత్తమ శాస్త్రవేత్త:
అగ్రోనోమి : డా. పి. సుజాతమ్మ, ప్రిన్సిపాల్ సైంటిస్ట్ & ప్రోగ్రాం కోఆర్డినేటర్, కృషి విజ్ఞాన కేంద్రం, బనవాసి.
ఏంటోమోలోజి : డా. ఎన్. బి. వి. చలపతి రావు, ప్రిన్సిపాల్ సైంటిస్ట్, డా. వై. ఎస్. ఆర్. ఉద్యాన విశ్వ విద్యాలయం, అంబాజీపేట.
వ్యవసాయ విస్తరణ:
డా. జి. ప్రసాద్ బాబు, సైంటిస్ట్, DAATTC, కర్నూల్.
హార్టికల్చర్:
డా. ఎమ్. రాజా నాయక్, అసోసియేట్ ప్రొఫెసర్, ఉద్యాన కళాశాల, అనంతరాజుపేట.
మొక్కల జన్యుశాస్త్రం:
డా. రాగిమేకుల నరసింహులు, సైంటిస్ట్, RARS, నంద్యాల.
సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చరల్ కెమిస్ట్రీ:
డా. సి. హెచ్. కిరణ్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఉద్యాన కళాశాల, పార్వతీపురం.
ఫుడ్ టెక్నాలజీ:
డా. ఎమ్. మాధవ, ప్రొఫెసర్ & హెడ్, డా. ఎన్. టి. ఆర్. వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల, బాపట్ల.
పశువైద్యం:
డా. ఎమ్. వి. ఎ. ఎన్. సూర్యనారాయణ, ప్రొఫెసర్ & హెడ్, వెటర్నరీ సైన్స్ కళాశాల, తిరుపతి.
ప్లాంట్ పాథాలజీ:
డా. వి. చంద్ర శేఖర్, సీనియర్ సైంటిస్ట్, RARS, అనకాపల్లి.
ఆక్వాకల్చర్:
డా. సి. హెచ్. బాలకృష్ణ, కృషి విజ్ఞాన కేంద్రం, ఆమదాలవలస.
2. ఉత్తమ విస్తరణ నిపుణుడు:
వ్యవసాయ విస్తరణ నిపుణులు:
డా. వి. శిల్పకళ, కృషి విజ్ఞాన కేంద్రం, ఊటుకూరు.

పశువైద్య విస్తరణ నిపుణులు:
అత్తూరు. కృష్ణమూర్తి, కృషి విజ్ఞాన కేంద్రం, బనగానపల్లి.
3. ఉత్తమ రైతు:
పండ్ల సాగు:
గంగరాజు. వెంకట్రామ రాజు, రైల్వే కోడూరు, అన్నమయ్య జిల్లా.
వరి సాగు:
పి. నాగరాజు, కాశీబుగ్గ, పలాస, శ్రీకాకుళం.
పత్తి సాగు:
కట్ట. రామకృష్ణ, ఓబన్నపాలెం, బాపట్ల.
పట్టుపురుగుల పెంపకం :
రెడ్డి. అసిరినాయుడు, బతువా, శ్రీకాకుళం.
పుట్టగొడుగుల సాగు:
జొన్న. చంద్ర మోహన్, ఆకుతోటపల్లి, అనంతపూర్.
సృజనాత్మక రైతు:
డి. బాబురావు, పార్వతీపురం, మన్యం జిల్లా.
4. ఉత్తమ సేంద్రియ/ సహజ వ్యవసాయ రైతు:
1st – వై. పద్మావతమ్మ, లొడ్డిపల్లి, కర్నూల్.
2nd – ఎన్. కృష్ణ మోహన్ రెడ్డి, గార్లదిన్నె, అనంతపురము.
3rd – ఉప్పలపాటి. చక్రపాణి, ఏలూరు.
5. ఉత్తమ మిద్దెతోట పెంపకదారుడు:
1st – కంకణాలపల్లి. రాధా, కాకినాడ, తూర్పు గోదావరి.
2nd – యర్రా. శేషకుమారి, రాజమండ్రి.
3rd – పేర్ల. అనురాధ, శ్రీకాకుళం.
6. ఉత్తమ వ్యవసాయ పాత్రికేయుడు (విలేఖరి):
దాసరి ఆళ్వార స్వామి, కుందేరు, కంకిపాడు, కృష్ణా జిల్లా.

7. ఉత్తమ FPO:
మన్యం సహజ FPO, బి. శంకర్ రావు
8. ఉత్తమ వ్యవసాయ ఇ – యాప్:
కెవికె అగ్రిటెక్ – ATP యాప్ – ఎం. రవి కిషోర్
9. ఉత్తమ సృజనాత్మక ఆలోచన (స్టూడెంట్స్) :
UG :
1st – ఎస్. హరికృష్ణ, ఆదరణ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కాలేజీ, అనంతపూర్.
2nd – పి. సాయి హేమంత్, డా. వై. ఎస్. ఆర్. హార్టికల్చరల్ యూనివర్సిటీ.
3rd – పరిమి. సాయి పృథ్వి శ్రీనివాస్, డా. ఎన్. టి. ఆర్. వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల, బాపట్ల.

PG & Ph. D:
1st – పి. శివమ్మ, డా. ఎన్. టి. ఆర్. వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల & ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం, గుంటూరు.
2nd – బి. శ్రీశైలం, ఎస్. వి. వ్యవసాయ కళాశాల, తిరుపతి.
3rd – కె. సంతోష్ కుమార్, డా. ఎన్. టి. ఆర్. వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల, బాపట్ల.

10. ఉత్తమ డిజిటల్ వేదిక :
గుత్తికొండ మాధవి – MAD GARDENER (You Tube Channel)

రాఘవ రావు గారా,
ఫౌండర్ & డైరెక్టర్
ఏరువాక ఫౌండేషన్,
701/J, 7వ అంతస్తు, బాబూఖాన్ ఎస్టేట్, బషీర్ బాగ్,
హైదరాబాద్, తెలంగాణ – 500 001
www.eruvaakafoundation.com
M: 9849106633

Invitation AP Event 2023 Final

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular