Mowgli Closing Collections: యాంకర్ సుమ(Anchor Suma Kanakala) కొడుకు రోషన్(Roshan kanakala) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘మోగ్లీ'(Mowgli Movie) ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యి పర్వాలేదు అనే టాక్ ని సొంతం చేసుకుంది. నందమూరి బాలకృష్ణ ‘అఖండ 2’ చిత్రం అదే రోజున విడుదల అయ్యినప్పటికీ కూడా ‘మోగ్లీ’ ని ధైర్యం చేసి విడుదల చేశారు మేకర్స్. టాక్ అయితే పర్వాలేదు అనే రేంజ్ లో వచ్చింది కానీ, కలెక్షన్స్ మాత్రం ఆ రేంజ్ లో రాలేదు. ఫలితంగా నిర్మాత , బయ్యర్స్ భారీ నష్టాలను ఎదురుకోవాల్సి వచ్చింది. ఈ చిత్రానికి ‘కలర్ ఫోటో’ ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వం వహించాడు. నేషనల్ అవార్డు ని సొంతం చేసుకున్న సినిమాకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ కాబట్టి, ఆడియన్స్ అతన్ని నమ్మి ఈ సినిమా థియేటర్స్ కి కదులుతారని అంతా అనుకున్నారు. కానీ చివరికి డిజాస్టర్ గానే మిగిలింది.
విడుదలకు ముందు ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి 5 కోట్ల రూపాయలకు జరిగింది. అంటే థియేటర్స్ నుండి ఈ చిత్రం కచ్చితంగా 5 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు, పది కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టాలి. మొదటి రోజున 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు రెండవ రోజు 70 లక్షలు , మూడవ రోజున 35 లక్షలు, నాల్గవ రోజున 30 లక్షలు, ఐదవ రోజున 20 లక్షలు, ఆరవ రోజున మరో 20 లక్షల రూపాయిలను రాబట్టింది. ఇక 7 వ రోజున అయితే ఈ సినిమా 90 శాతం కి పైగా వసూళ్లను డ్రాప్ అవుతూ కేవలం 3 లక్షల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది. అలా బాక్స్ ఆఫీస్ రన్ ని కొనసాగించిన ఈ సినిమాకు ఓవరాల్ ఇండియా వైడ్ గా 3 కోట్ల 48 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఇక ఓవర్సీస్ ప్రాంతం నుండి 62 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 4 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అంటే కేవలం రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే రాబట్టింది అన్నమాట. 50 శాతం కంటే తక్కువ రికవరీ ని సాధించిన ఈ సినిమాని ట్రేడ్ విశ్లేషకులు డిజాస్టర్ ఫ్లాప్ క్యాటగిరీలోకి నెట్టేశారు. మొదటి సినిమా ఫ్లాప్ తో డీలా పడిన రోషన్ కే, రెండవ సినిమాతో కూడా అదే అనుభవం ఎదురు అవ్వడం బాధాకరం.