Mowgli Movie Twitter Talk: ప్రముఖ యాంకర్ సుమ(Suma Kanakala) కొడుకు రోషన్(Roshan Kanakala) హీరో గా నటించిన రెండవ చిత్రం ‘మోగ్లీ'(Mowgli Movie). మొదటి చిత్రం ‘బబుల్ గమ్’ కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది. కానీ రోషన్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఎదో సుమ కొడుకు, ఇండస్ట్రీ లోకి తీసుకొచ్చి జనాల మీద రుద్దడానికి చూస్తున్నారు అని అనుకునేలా లాగా ఈ కుర్రాడు లేడు, నటన చాలా బాగుంది, మంచి సినిమాలు చేస్తే పెద్ద రేంజ్ కి వెళ్తాడు అని అంతా అనుకున్నారు. ‘మోగ్లీ’ మూవీ ప్రకటించినప్పుడు ఎదో కొత్తగా ప్రయత్నం చేసినట్టు ఉన్నారు, పైగా కలర్ ఫోటో సందీప్ రాజ్ దర్శకుడు కాబట్టి ఈ చిత్రం రోషన్ కి మంచి సూపర్ హిట్ గా నిలుస్తుందని అంతా అనుకున్నారు. నేడు ‘అఖండ 2’ విడుదల అయినప్పటికీ ఆ చిత్రానికి పోటీ గా ‘మోగ్లీ’ ని విడుదల చేసారు. మరి ఆడియన్స్ ఈ చిత్రం గురించి అనుకుంటున్నారో చూద్దాం.
Ahaa Ekkada chusina Positive reviews eh unnay, Mana co-fan @sandeepraaj Gatthigane kottadu!!
Congratulations Anna ❤ #Mowgli pic.twitter.com/q2Fkj3aUe1— ᴿᴱᴮᴱᴸᵂᴼᴼᴰ (@gani_tweetzz) December 12, 2025
ఈ చిత్రాన్ని చూసిన ఆడియన్స్ ఫస్ట్ హాఫ్ బోరింగ్ గా ఉందంటూ కామెంట్స్ చేశారు. విలన్ బండి సరోజ్ క్యారక్టర్ తప్ప, ఫస్ట్ హాఫ్ లో ‘అబ్బా..ఏముందిరా సీన్’ అనే ఫీలింగ్ ఎక్కడా కూడా కలగదని, చాలా ఫ్లాట్ గా, డల్ గా స్క్రీన్ ప్లే ఉందని చెప్పుకొచ్చారు. సెకండ్ హాఫ్ చాలా గొప్పగా ఉండాలి , లేదంటే ఈ సినిమా క్లిక్ అవ్వడం కష్టమే అనే ఫీలింగ్ వస్తాది. కనీసం సెకండ్ హాఫ్ లో అయినా సినిమా ట్రాక్ లోకి వస్తుందనే ఆశతో కూర్చున్న ఆడియన్స్ కి ఇంకా ఎక్కువ నిరాశ కలిగింది. ఓవరాల్ గా సినిమా స్టోరీ రొటీన్ గా ఉన్నా, స్క్రీన్ ప్లే లో నోవెల్టీ, బలమైన ఎమోషనల్ కనెక్షన్ ఉంటుందేమో అని ఆశించి ఈ చిత్రానికి ఆడియన్స్ వెళ్లారు. కానీ అలా వెళ్లిన ఆడియన్స్ ని తీవ్రమైన నిరాశకు గురి చేసింది ఈ చిత్రం.
TICKET PRICE of #Mowgli is just ₹99/- for single screens
USA Premieres talk kuda baaagundhi so show veyochu pic.twitter.com/KvVmnPDudi— Rowdy DHFM (@JyothsnaSri7) December 12, 2025
కానీ ఇందులో కూడా రోషన్ నటన చాలా బాగుంది అనే ప్రశంసలు లభిస్తున్నాయి. విలన్ బండి సరోజ్ క్యారక్టర్ చాలా బాగుందట . సందీప్ రాజ్ లో మంచి ఆలోచనలే ఉన్నాయి, కానీ సినిమాలు ఆ లెవెల్ లో తీయడం లో విఫలం అవుతున్నాడు, ఓవరాల్ గా ఈ చిత్రం డిజాస్టర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సుమ కొడుకు ఇంకా కొన్నేళ్లు సక్సెస్ కోసం ఎదురు చూడక తప్పేలా లేదు. మంచి టాలెంట్ ఉన్న కుర్రాడు, మంచి డైరెక్టర్ చేతిలో పడితే బాగుంటుంది అని ప్రేక్షకులు కోరుకుంటున్నారు, చూడాలి మరి భవిష్యత్తు ఏంటో.
TICKET PRICE of #Mowgli is just ₹99/- for single screens
USA Premieres talk kuda baaagundhi so show veyochu pic.twitter.com/KvVmnPDudi— Rowdy DHFM (@JyothsnaSri7) December 12, 2025