Sandeep Raj wife: కలర్ ఫోటో చిత్రం తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సందీప్ రాజ్(Sandeep Raj) తొలి సినిమాతోనే భారీ హిట్ ని అందుకొని మంచి పేరు తెచున్నాడు. ఈ చిత్రానికి నేషనల్ అవార్డు కూడా దక్కింది. కానీ విశేషం ఏమిటంటే ఇది వెండితెర చిత్రం కాదు , ఆహా మీడియా లో డైరెక్ట్ గా విడుదలైంది. అలా ఓటీటీ లో విడుదలైన సినిమాకు నేషనల్ లెవెల్ గుర్తింపు రావడమే కాకుండా, నేషనల్ అవార్డు కూడా దక్కడం సాధారణమైన విషయం కాదు. ఈ చిత్రం తర్వాత ఆయన అనేక సినిమాల్లో క్యారక్టర్ రోల్స్ చేసాడు కానీ, దర్శకత్వం మాత్రం వహించలేదు. లేటెస్ట్ గా ఆయన దర్శకత్వం వహించిన ‘మోగ్లీ’ చిత్రం మంచి అంచనాల నడుమ విడుదలైంది. యాంకర్ సుమ తనయుడు రోషన్ హీరో గా నటించిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
పైగా టికెట్ రేట్స్ కూడా చాలా తక్కువగా ఉండడం తో కలెక్షన్స్ బాగున్నాయి. ఇదంతా పక్కన పెడితే సందీప్ రాజ్ కి పెళ్లి అయ్యిందని, ఆయన భార్య కూడా సినిమాల్లో నటించింది అనే విషయం మీకు ఎవరికైనా తెలుసా..?, ఆయన భార్య పేరు చాందిని రాజ్. ఈమె సందీప్ దర్శకత్వం వహించిన ‘కలర్ ఫోటో’ చిత్రం లో హీరోయిన్ కి స్నేహితురాలి క్యారక్టర్ చేసింది. గమ్మత్తు ఏమిటంటే ఈ చిత్రం లో హీరోయిన్ పేరు కూడా చాందిని చౌదరి నే. అయితే ఈ సినిమా షూటింగ్ సమయం లోనే సందీప్ మరియు చాందిని మధ్య స్నేహం పెరగడం, ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లడం వంటివి జరిగాయి. కలర్ ఫోటో చిత్రం తర్వాత సందీప్ రాజ్ కథలు అందించిన ‘హెడ్స్ అండ్ టేల్స్’, ‘రణస్థలి’ వంటి చిత్రాల్లో కూడా ఈమె క్యారక్టర్ ఆర్టిస్టు గా నటించింది.
చూసేందుకు హీరోయిన్స్ కి ఏమాత్రం తక్కువ కానీ రేంజ్ లో ఉన్న చాందిని ని మీరు కూడా ఈ క్రింది ఫోటోలలో చూడొచ్చు. ఇన్ స్టాగ్రామ్ లో ఈ జంటకు మంచి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇకపోతే పెళ్లి తర్వాత విడుదలైన తన మొట్టమొదటి సిల్వర్ స్క్రీన్ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ రావడం తో సందీప్ కూడా ఫుల్ జోష్ మీద ఉన్నాడు. రాబొయ్యే రోజుల్లో ఈయన నుండి ఎలాంటి సినిమాలు వస్తాయో, భవిష్యత్తులో పెద్ద రేంజ్ కి వేళ్తాడో లేదో చూడాలి.