Hit After Negative Talk: బాగా తీసినంత మాత్రాన సినిమా సూపర్ హిట్ కాదు. ఓ మూవీ బాక్సాఫీస్ సక్సెస్ అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఆడియన్స్ మూడ్, విడుదలైన టైం, అప్పటి ట్రెండ్, సోషల్ కండీషన్స్ అనేక విషయాలు అనుకూలించాలి. ఈ క్రమంలో హిట్ టాక్ తెచ్చకున్న సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడం, ప్లాప్ టాక్, యావరేజ్ టాక్ తెచ్చుకొని వసూళ్లు దుమ్ముదులపడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. టాలీవుడ్ లో మన టాప్ స్టార్స్ నటించిన కొన్ని చిత్రాలు మొదట్లో ప్లాప్ టాక్ తెచ్చుకొని తర్వాత సూపర్ హిట్ సొంతం చేసుకున్నాయి. ఆ చిత్రాలు ఏమిటో చూద్దాం.
సర్కారు వారి పాట: పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు- కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట ఫస్ట్ షో నుండే నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మిక్స్‌డ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన ఈ మూవీ హిట్ స్టేటస్ సొంతం చేసుకుంది.

బంగార్రాజు: 2022 సంక్రాంతి విన్నర్ గా నిలిచింది బంగార్రాజు. పెద్ద సినిమాల విడుదల వాయిదా బంగార్రాజు చిత్రానికి కలిసొచ్చింది. నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన బంగార్రాజు యావరేజ్ టాక్ తో మంచి వసూళ్లు అందుకుంది. బంగార్రాజు రన్ ముగిసే నాటికి రూ. 66 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్, రూ. 39 కోట్ల షేర్ రాబట్టింది.
Also Read: Nani- Ante Sundaraniki Collections: నంబర్స్ ని కాదు ప్రేక్షకుల ప్రేమను సెలబ్రేట్ చేసుకుంటున్నాం

పుష్ప : అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘పుష్ఫ’. మొదటి రోజు పుష్ప మిక్స్డ్ టాక్ అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో నష్టాలు మిగిల్చిన పుష్ప హిందీలో వంద కోట్లకు పైగా వసూళ్ళతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

సరిలేరు నీకెవ్వరు: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’. 2020 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ టాక్ తో మహేష్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డులకు ఎక్కింది.

వెంకీమామ : ఆఫ్ స్క్రీన్ మామా అల్లుళ్ళు వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా నటించిన ‘వెంకీ మామ’ సినిమాకు ముందుగా మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఫైనల్ గా రూ. 33 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ షేర్ వసూలు చేసి, హిట్ స్టేటస్ సొంతం చేసుకుంది.

మహర్షి: మహేష్ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో వచ్చిన మహర్షి ఫస్ట్ షో నుండి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే థియేటర్స్ లో లాంగ్ రన్ కొనసాగగా… ఫైనల్ గా మంచి బిజినెస్ చేసి హిట్టయింది.

జై సింహా : 2018 సంక్రాంతి బరిలో నిలిచింది జై సింహ. బాలకృష్ణ, నయనతార కాంబినేషన్ లో కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సంక్రాంతి సీజన్ క్యాష్ చేసుకున్న జై సింహ ఫైనల్ గా హిట్ దక్కించుకుంది.

దువ్వాడ జగన్నాథం: హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన చిత్రం దువ్వాడ జగన్నాథం. మొదట్లో ఈ చిత్రం నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. మెల్లగా బాక్సాఫీస్ వద్ద పుంజుకున్న డీజే అల్లు అర్జున్ కి ఓ మోస్తరు విజయాన్ని అందించింది.

జనతా గ్యారేజ్: శ్రీమంతుడు హిట్ తో మంచి ఊపుమీదున్న కొరటాల శివ ఎన్టీఆర్ చేసిన చిత్రం జనతా గ్యారేజ్. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కీలక రోల్ చేయగా, జనతా గ్యారేజ్ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే బాక్సాఫీస్ వద్ద లాంగ్ రన్ కొనసాగించిన ఈ మూవీ ఫైనల్ గా బ్రేక్ ఈవెన్ దాటి హిట్ కొట్టింది.

సరైనోడు: బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన మూవీ ‘సరైనోడు’.ప్లాప్ టాక్ తెచ్చుకున్న సరైనోడు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అప్పటికి అల్లు అర్జున్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

నాన్నకు ప్రేమతో: ఎన్టీఆర్- సుకుమార్ కాంబినేషన్ తెరకెక్కిన సైకలాజికల్ థ్రిల్లర్ నాన్నకు ప్రేమతో… ఎన్టీఆర్ 25వ చిత్రంగా విడుదలైన ఈ చిత్రం మొదట్లో ప్లాప్ టాక్ తెచ్చుకుంది. మెల్లగా కంటెంట్ జనాలకు ఎక్కడంతో హిట్ అయ్యింది. ఓవర్సీస్ లో ఈ చిత్రం మంచి వసూళ్లు రాబట్టింది.

సన్నాఫ్ సత్యమూర్తి : అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన రెండవ చిత్రం ‘సన్నాఫ్ సత్యమూర్తి’. ఈ చిత్రం సైతం నెగిటివ్ టాక్ తెచ్చుకొని హిట్ గా నిలిచింది.

బిజినెస్ మాన్ : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘బిజినెస్ మేన్’. పోకిరి తో పోల్చుతూ మొదట నెగిటివ్ టాక్ వినిపించింది. మెల్లగా పుంజుకున్న ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది.

జల్సా : పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జల్సా’. ఈ మూవీకి ఫస్ట్ షో నుండే ప్లాప్ టాక్ నడిచింది. దేవిశ్రీ సాంగ్స్ సినిమాకు ప్లస్ కాగా, ఓ మోస్తరు విజయం దక్కించుకుంది.

Also Read:KCR BRS Party: కేసీఆర్ ‘బిఆర్ఎస్’.. ఉండవల్లి, పవన్ కళ్యాణ్ కు బాధ్యతలు?