https://oktelugu.com/

‘Akhanda’ Theater Business Close: ‘అఖండ’ థియేటర్ బిజినెస్ క్లోజ్.. మొత్తం కలెక్షన్స్ ఎంతంటే ?

‘Akhanda’ Theater Business Close: బాలయ్య అఖండ సినిమా రిలీజ్ కి ముందు తెలుగు సినీ కళామతల్లి తన ఉనికి కోసం భయంతో బిక్కుబిక్కుమంటూ ఆశగా ఎదురుచూస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఏ స్టార్ హీరో తన సినిమాని రిలీజ్ చేయడానికి ముందుకు రాలేదు. ఇలాంటి సమయంలో భారీ అంచనాలతో వచ్చింది ‘అఖండ’. ఈ సినిమా మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా రిలీజ్ అయిన ఐదో వారంలో కూడా […]

Written By:
  • Shiva
  • , Updated On : January 2, 2022 / 05:36 PM IST

    Akhanda collection

    Follow us on

    ‘Akhanda’ Theater Business Close: బాలయ్య అఖండ సినిమా రిలీజ్ కి ముందు తెలుగు సినీ కళామతల్లి తన ఉనికి కోసం భయంతో బిక్కుబిక్కుమంటూ ఆశగా ఎదురుచూస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఏ స్టార్ హీరో తన సినిమాని రిలీజ్ చేయడానికి ముందుకు రాలేదు. ఇలాంటి సమయంలో భారీ అంచనాలతో వచ్చింది ‘అఖండ’. ఈ సినిమా మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబట్టింది.

    ‘Akhanda’ Theater Business Close

    ఈ సినిమా రిలీజ్ అయిన ఐదో వారంలో కూడా బాగానే కలెక్ట్ చేసింది. మొత్తమ్మీద కలెక్షన్స్ విషయంలో అఖండ ఏ మాత్రం తగ్గ లేదు. నిజానికి ఈ సినిమా కేవలం 8 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయింది. ఒక విధంగా కరోనా సెకెండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ లో ఊపు కనిపించలేదు. తెలుగు సినిమాకి కరోనా అనంతరం సాలిడ్ హిట్ అందించిన సినిమాగా కూడా అఖండ నిలిచింది.

    Also Read:  నార్త్‌లోనూ ‘తగ్గేదేలే’.. సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘పుష్ప’ రాజ్..

    మొత్తమ్మీద అఖండతో బాలయ్య ఇప్పుడు తన కెరీర్ లోనే బెస్ట్ కలెక్షన్స్ ను రాబట్టాడు. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే బోణీ కోటింది అఖండ. మరి ఈ చిత్రం థియేటర్ బిజినెస్ క్లోజ్ చేసుకునే సమయానికి ఏ రేంజ్ కలెక్షన్స్ ను సాధించిందో చూద్దాం. అఖండ కలెక్షన్స్ ను ఏరియాల వారీగా చూస్తే..

    నైజాం 20.70 కోట్లు
    సీడెడ్ 15.91 కోట్లు
    గుంటూరు 4.66 కోట్లు
    కృష్ణా 3.55 కోట్లు
    నెల్లూరు 2.58 కోట్లు
    ఉత్తరాంధ్ర 7.06 కోట్లు
    ఈస్ట్ 4.09 కోట్లు
    వెస్ట్ 4.83 కోట్లు

    ఇక ఏపీ మరియు తెలంగాణ మొత్తం కలుపుకుని చూస్తే : 63.38 కోట్లు

    రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 11.16 కోట్లు

    ఓవరాల్ గా మొత్తం వరల్డ్ వైడ్ గా 74.54 కోట్లును ఈ చిత్రం రాబట్టింది.

    ‘అఖండ’ సినిమాకు రూ.53.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మొత్తమ్మీద ఈ చిత్రం 5 వారాలు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.74.54 కోట్ల షేర్ ను రాబట్టింది. ఓవరాల్ గా చూసుకుంటే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి రూ.22 కోట్ల లాభాలు దక్కాయి. పైగా శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ రూపంలో అదనపు లాభాలు వచ్చాయి.

    Also Read: రెమ్యూనరేషన్ గురించి క్లారిటి ఇచ్చిన మాస్ మహరాజ్… ఏమన్నాడంటే ?

    Tags