Star Heroes: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక వారంలోనే చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. ఇక అందులో కొన్ని సక్సెస్ అయితే మరికొన్ని మాత్రం ఫెయిల్యూర్స్ గా మిగిలిపోతున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయా దర్శకులు సినిమాలను చేసినందుకు సూపర్ సక్సెస్ లను అందుకుంటుంటే మరి కొంతమంది ఫ్లాప్ లను మూటగట్టుకొని మరొక అవకాశాన్ని కూడా అందుకోలేకపోతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొన్ని సినిమాలు మళ్ళీ చూద్దాం అంటే ఎక్కడ కనిపించడం లేదు..అవి ఏ సినిమాలో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా మేనల్లుడు గా గుర్తింపు పొందిన సాయి ధరమ్ తేజ్ ‘పిల్ల నువ్వు లేని జీవితం’ అనే సినిమాతో మంచి విజయాన్ని అనుకున్నాడు. ఇక ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరుని సంపాదించుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే వరుసగా పాన్ ఇండియా స్టాండర్డ్ లతో కూడా సినిమాలు చేసే అవకాశాలను అయితే అందుకున్నాడు.
కానీ ఈయన వైవిఎస్ చౌదరి డైరెక్షన్ లో చేసిన ‘రేయ్’ సినిమా మాత్రం డిజాస్టర్ గా మిగిలింది. అయితే ఈ సినిమా ఇప్పటివరకు ఏ ప్లాట్ ఫామ్ లో కూడా అవలెబుల్లో లేదు. ఓటిటి లో గానీ, యూట్యూబ్ లోకి గానీ ఎక్కడ కూడా ఇంకా ఈ సినిమా రాలేదు. మరి ఈ సినిమా చేసినందుకు వైవీఎస్ చౌదరి భారీగా నష్టపోవడమే కాకుండా ఇండస్ట్రీ నుంచి ఫెయిడ్ ఔట్ అయిపోయే పరిస్థితి కూడా నెలకొన్నందుకు ఒక వంతుకు బాధాకరమైన విషయమనే చెప్పాలి…
సిద్ధార్థ్ హీరోగా, సమంత హీరోయిన్ గా నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన జబర్దస్త్ సినిమా అప్పట్లో ఆవరేజ్ హిట్ గా మిగిలింది. అయితే ఈ సినిమా కూడా ప్రస్తుతం ఏ ఓటిటి ప్లాట్ ఫామ్ లో అవలేబుల్ లో లేదు. ఇక యూట్యూబ్ లో అవలేబుల్ లో ఉన్నప్పటికీ అది డివిడి వర్షన్ మాత్రమే అవలేబుల్ లో ఉంది. హెచ్ డి ప్రింట్ మాత్రం ఇంకా అవలేబుల్ లోకి రాలేదు. ఇక దీన్ని బట్టి చూస్తే ఈ సినిమాలు కొనడానికి ఏ ప్లాట్ఫారం కూడా ముందుకు రావడం లేదు అంటే ఈ సినిమాలు ఎలాంటి డిజాస్టర్ సినిమాలో మనం అర్థం చేసుకోవచ్చు…