Homeఎంటర్టైన్మెంట్Movies In OTT: ఈ వారం ఓటిటి లో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు సిరీస్...

Movies In OTT: ఈ వారం ఓటిటి లో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు సిరీస్ లు ఇవే…

Movies In OTT :  తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న హీరోలు మంచి స్థానాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం మనకు తెలిసిందే… ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం సినిమా థియేటర్లోనే కాకుండా ఓటిటిలో కూడా మంచి సినిమాలు వస్తు సందడి చేస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకోవడానికి ఈవారం కొన్ని సినిమాలు, సిరీస్ లు ఓటిటిలోకి రాబోతున్నాయి. మరి ఆ సినిమాలేంటి సిరీసులేంటి అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

వైఫ్ ఆఫ్

అభినవ్, నిఖిల్, సాయి శ్వేతలు మెయిన్ లీడ్ లో నటించిన ‘వైఫ్ ఆఫ్’ అనే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఓటిటిలో స్ట్రీమింగ్ అవ్వడానికి సిద్ధమైంది. ఇక జనవరి 23వ తేదీన ఈ సినిమా ‘ఈటీవీ విన్’ లో స్ట్రీమింగ్ అవుతుంది…

విడుదల 2

గత నెలలో రిలీజ్ అయిన విడుదల 2 సినిమా థియేటర్ లో ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోయింది. ఇక విజయ్ సేతుపతి, మంజు వారియర్ నటించిన ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమా ఇప్పుడు తెలుగు వెర్షన్ ‘అమెజాన్ ప్రైమ్’ లో జనవరి 23వ తేదీన స్ట్రీమింగ్ అవ్వబోతుంది…

రజాకర్

బాబి సింహ,వేదిక, అనసూయలు లీడ్ రోల్ లో నటించిన ‘రజాకార్’ సినిమా గత సంవత్సరం థియేటర్లలోకి వచ్చింది.ఇక ఈ సినిమా వచ్చి దాదాపు సంవత్సరం అవుతుంది. ఇక ఇప్పటివరకు కూడా ఈ సినిమా ఓడిటిలో స్ట్రీమింగ్ కి రాలేదు.
జనవరి 24వ తేదీన ‘ఆహా’లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవ్వడానికి సిద్ధమైంది…

సివరపల్లి

రాగ్ మయూర్, మురళీధర్ గౌడ్, రూప లీడ్ రోల్ లో నటించిన ‘సివరపల్లి ‘ సినిమా ఈనెల 24వ తేదీన ‘అమెజాన్ ప్రైమ్’ లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది. అయితే ఈ సీరీస్ లో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉండటమే కాకుండా జనాలకి ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది…

బరోజ్

మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన భరోజ్ సినిమా గత నెలలో థియేటర్లోకి వచ్చి సందడి చేసింది డిష్ టి ప్లస్ హాట్స్టార్ లో 24వ తేదీన స్ట్రీమింగ్ అవ్వడానికి సిద్ధమయింది… ఓటిటి ప్లాట్ఫారంలో ఈ సినిమాకి ఎలాంటి ఆదరణ దక్కుతుంది. తద్వారా సినిమాని చూసిన ప్రేక్షకులు ఎలాంటి థ్రిల్ కి ఫీల్ అవుతారనే విషయం అయితే తెలియాల్సి ఉంది…

ఫీయర్

డాక్టర్ హరిత గోగినేని దర్శకత్వంలో వచ్చిన ‘ఫియర్ ‘ సినిమా థ్రిల్లర్ మాత్రమే కాకుండా అందులో హారర్ గొలిపే ఎలిమెంట్స్ కూడా ఎక్కువగా ఉండడం విశేషం…అమెజాన్ ప్రైమ్ లో 24వ తేదీన స్ట్రీమింగ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది…

వెనమ్ లాస్ట్ డ్యాన్స్

టామ్ హర్టీ, చివెటిల్ ఎజియో ఫోర్ అనే నటులు నటించి కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారో ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ అవడంలో వారి కీలకపాత్ర వహించాలని మొత్తానికైతే ఈ సినిమా జనవరి 25వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది…

ఇక వీటితో పాటు గా

జీ 5 లో
హిసాబ్ బరాబర్, తిరుమానికం రెండు సినిమాలు కూడా జనవరి 24 వ తేదీన స్ట్రీమింగ్ అవ్వబోతున్నాయి..

నెట్ ఫ్లిక్స్

డి నైట్ ఎజెంట్ 2 జనవరి 23 స్ట్రీమింగ్ అవుతుంది…
డి శాండ్ క్యాసిల్, ది ట్రామా కాల్ అనే రెండు సినిమాలు జనవరి 24 న స్ట్రీమింగ్ అవుతున్నాయి.
పర్ఫెక్ట్ మ్యాచ్ జనవరి 25 న స్ట్రీమింగ్ అవుతుంది.
ఫ్రేఫర్ ది డెవిల్ ఈ మూవీ జనవరి 26 న స్ట్రీమింగ్ అవుతుంది…

హాట్ స్టార్
స్వీట్ డ్రీమ్స్ అనే మూవీ జనవరి 24 న స్ట్రీమింగ్ అవుతుంది…
కోల్డ్ ప్లే జనవరి 26 న స్ట్రీమ్ అవుతుంది…

జియో సినిమా
ఇక హాలీవుడ్ నుంచి దిది అనే మూవీ కూడా జనవరి 26 న స్ట్రీమింగ్ అవుతుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Exit mobile version